Ganja Shankar - Sai Tej Pre Look : 'గాంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్ ప్రీ లుక్ చూశారా? - రేపే ఫస్ట్ హై!

Ganja Shankar First High - Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇవాళ ప్రీ లుక్ విడుదల చేశారు.

Continues below advertisement

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా  మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. అంటే... ఆయన శ్రీమతి సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది (Sampath Nandi) దర్శకుడు. 

Continues below advertisement

'గాంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్!
సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది సినిమాకు 'గాంజా శంకర్' (Ganja Shankar movie) టైటిల్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే... ఆ విషయాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు. 

'గాంజా శంకర్' సినిమాలో సాయి ధరమ్ తేజ్ ప్రీ లుక్ ఈ రోజు విడుదల చేశారు. ఆ లుక్కులో హీరో మెడ మీద త్రిశూలం, దాని కింద డమరుకం టాటూ ఉంది. అలాగే, చెవికి పోగు కూడా ఉంది. సినిమాలో గంజాయి అమ్మే యువకుడిగా హీరో పాత్ర ఉంటుందని ఫిల్మ్ నగర్ గుసగుస. అందుకని, ఆ టైటిల్ అని సమాచారం. తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్, యాక్షన్, ఎమోషన్స్ ఇచ్చే కథను సంపత్ నంది రెడీ చేశారట. 

Also Read : అమెరికాలో విజయ్, ఫ్యాన్స్‌కు షాక్ - విడుదలకు ముందు షోస్ క్యాన్సిల్ ఏంటి?

ఆదివారం ఉదయం ఫస్ట్ హై!
Ganja Shankar First High : ఆదివారం ఉదయం సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. అప్పుడు ఫస్ట్ హై పేరుతో ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.  

Also Read 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?

సాయి తేజ్ జోడీగా పూజా హెగ్డే!?
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ జోడీగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే పరిశీలనలో ఉంది. ఇప్పటి వరకు మెగా కుటుంబంలోని ముగ్గురు హీరోల సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడీగా 'ఆచార్య'లో నటించారు. అంతకు ముందు 'రంగస్థలం' సినిమాలో ప్రత్యేక గీతం చేశారు. వరుణ్ తేజ్ సరసన 'ముకుంద', 'గద్దలకొండ గణేష్' చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం డీజే', 'అల వైకుంఠపురములో' సినిమాల్లోనూ నటించారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ జోడీగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటించనున్నారని సమాచారం. 

సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, పూజా హెగ్డే... ఇద్దరూ ఇప్పటి వరకు సినిమా చేయలేదు. వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. సంపత్ నందికి మరోసారి మెగా కుటుంబంలోని యువ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'రచ్చ' తీశారు. ఇప్పుడు సాయి తేజ్‌తో సినిమా ఓకే అయ్యింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
 

Continues below advertisement