తమిళనాట విజయ దశమికి విడుదల అవుతున్న భారీ సినిమాల్లో 'లియో' (Leo Movie) ఒకటి. 'విక్రమ్' విజయం తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడి కంటే ఎక్కువ తమిళ స్టార్, దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరో కావడంతో తెలుగు, హిందీ జనాలు కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇండియాలో మాత్రమే కాదు... విదేశాల్లో భారతీయులు సైతం 'లియో' చూడాలని వెయిట్ చేస్తున్నారు. అయితే, అమెరికాలో ప్రేక్షకులకు 'లియో' షాక్ ఇచ్చింది!


ఐమ్యాక్స్ షోస్ క్యాన్సిల్ చేస్తున్నారోయ్!
దసరా సందర్భంగా అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది. అమెరికా, యూకేలో అడ్వాన్స్ సేల్స్ బావున్నాయి. అయితే... అమెరికాలో కొన్ని షోస్ క్యాన్సిల్ అవుతూ ఉండటం అభిమానులకు షాక్ ఇచ్చింది. అందుకు కారణం... ఐమ్యాక్స్ ఫార్మాట్ వెర్షన్ ఇంకా థియేటర్లకు అందకపోవడమే!






సోమవారం సాయంత్రానికి ఐమ్యాక్స్ ఫార్మాట్ వెర్షన్ ఓవర్సీస్ వెళుతుందని చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపినట్లు సమాచారం. షోస్ క్యాన్సిల్ కావడం వల్ల తప్పకుండా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సోమవారం కంటెంట్ వెళ్లినా... అప్పటికి వేరే సినిమాలు షెడ్యూల్ చేస్తే, ముందుగా అనుకున్న స్క్రీన్లు లభించకపోవచ్చు.


Also Read : 'భగవంత్ కేసరి' సెన్సార్ హోగయా - ఫస్ట్ రివ్యూ ఏంటంటే?


మరోవైపు అమెరికాలో ఇప్పటి వరకు 35 వేల టికెట్స్ విక్రయించారు. మరోవైపు యూకేలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఇప్పటి వరకు యూకేలో హయ్యస్ట్ ఇండియన్ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. 


Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?






'లియో'ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ జోడీగా త్రిష నటించారు. వాళ్ళిద్దరూ సుమారు 14 ఏళ్ళ విరామం తర్వాత చేసిన చిత్రమిది. 



త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ 'లియో'లో కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial