యాక్ట్రెస్, మూవీ ప్రొడ్యూసర్ - ప్రజెంటర్, టాక్ షో హోస్ట్... మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)ను ఏమని పరిచయం చేయాలి? ప్రతి పాత్రలో తన ప్రతిభను ఆవిడ నిరూపించుకున్నారు. నటిగా విభిన్నమైన పాత్రలు చేయడంతో పాటు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు 'షెఫ్ మంత్ర' షోను హోస్ట్ చేస్తున్నారు. నటిగా, వ్యాఖ్యాతగా స్క్రీన్ మీద కనిపిస్తూ... స్క్రీన్ వెనుక నిర్మాతగానూ బిజీగా ఉన్నారు. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. నిహారిక నిర్మిస్తున్న కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ఇంతకీ, అది ఏమిటో తెలుసుకోండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Om Bheem Bush Collections: వర్సటైల్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'ఓం భీమ్ బుష్'. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. గత శుక్రవారం (మార్చి 22) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ కు హిట్ టాక్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్ గా నవ్వించి, బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. 'సామజవరగమన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు నటించిన సినిమా కావడంతో 'ఓం భీమ్ బుష్' కు రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ జరిగింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడం, రివ్యూలు సానుకూలంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 21.75 రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Actor Pruthviraj Comments: ఈసారి ఎలాగైన వైఎస్సార్‌సీపీని అధికార పీఠం నుంచి దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తు ప్రకటించినప్పటి నుంచి ఏపీ రాజకీయాలు మరింత వాడివేడిగా మారాయి. చివరికి వరకు సీఎం పీఠం ఎవరిదనేది కూడా చెప్పడం కష్టంగా మారింది.జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ప్రచారంలో మరింత దూకుడు చూపిస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలోనూ ఏపీ రాజకీయాలు హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇండస్ట్రీలో అగ్ర నటీనటులు, ప్రముఖులంతా ఏ పార్టీకి సపోర్టుగా ఉంటారా? అనేది సినీ, రాజకీయాల్లో ఆసక్తికర అంశమైంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఏపీ పొలిటిక్స్‌పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Kangana Ranaut: బాలీవుడ్ కాంట్రవర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతోంది. బీజేపీ తరపున హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఎంపీగా పోటీకి దిగనుంది. జాతీయ ఎన్నికలకు ఇంకా కొన్నిరోజులు ఉంది అనగానే రాజకీయాల్లో ఒక కొత్త కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. కాంగ్రెస్ ప్రతినిధి అయిన సుప్రియా శ్రీనతే.. కంగనాపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ఇందులో కంగనా మోడర్న్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఇది చూసిన కంగనా.. వెంటనే తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అయితే ఇదంతా తాను చేయలేదని సుప్రియా వివరణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Mass Maharaja Raviteja: మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రారంభం నుంచీ హిట్టు ఫ్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. గతేడాది 'వాల్తేరు వీరయ్య', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలలో అలరించిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే 'ఈగల్' మూవీని రిలీజ్ చేశారు. ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకి వచ్చింది. రవితేజ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇటీవలే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హరీష్ ఎప్పటికప్పుడు ఈ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు.. ఇప్పుడు తాజా షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)