Om Bheem Bush Collections: వర్సటైల్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'ఓం భీమ్ బుష్'. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. గత శుక్రవారం (మార్చి 22) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ కు హిట్ టాక్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్ గా నవ్వించి, బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. 


'సామజవరగమన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు నటించిన సినిమా కావడంతో 'ఓం భీమ్ బుష్' కు రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ జరిగింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడం, రివ్యూలు సానుకూలంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 21.75 రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 






శ్రీ విష్ణు సినిమా ఫస్ట్ డే రూ. 4.6 కోట్ల వసూళ్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు రూ .5.8 కోట్లు, మూడో రోజు రూ.6.56 కోట్లు అందుకుని.. రూ.17 కోట్ల కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ ను ముగించింది. హోళీ పండుగ కూడా కలిసి రావడంతో, మొదటి రోజు కంటే ఎక్కువగా నాలుగో రోజు రూ. 4.75 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 21.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక యాఎస్ లో $350 K వసూళ్లు రాబట్టి, హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ దిశగా పయనిస్తోంది.


నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ తో నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని 'ఓం భీమ్ బుష్' సినిమాని రూపొందించారు. ఇందులో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తమదైన శైలిలో నవ్వులు పూయించారు. 'బ్రోచేవారెవరురా' తర్వాత ఈ ముగ్గురూ మరోసారి కామెడీ పండించారు. A To Z సొల్యూషన్స్ బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్ గా తమ కామిక్ టైమింగ్ తో అదరగొట్టారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.


యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు 'ఓం భీమ్ బుష్' చిత్రాన్ని నిర్మించారు. సన్నీ ఎంఆర్ సంగీతం సమకూర్చారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వ్యవహరించారు. మార్చి 29న 'టిల్లు స్క్వేర్' రిలీజ్ అయ్యేదాకా పోటీలో మరో మూవీ లేదు కాబట్టి, శ్రీ విష్ణు సినిమా వచ్చే వారాంతం వరకూ డీసెంట్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎక్కడిదాకా వెళ్తుందో వేచి చూడాలి.


Also Read: అటు సినిమాలు, ఇటు వివాదాలు - ప్రకాష్ రాజ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?