మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durg‌ha Tej)కు గత ఏడాది బాగా కలిసి వచ్చింది. హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ 'విరూపాక్ష'తో వంద కోట్ల వసూళ్లు సాధించాడు. ఓ భారీ విజయం అందుకున్నాడు. 'విరూపాక్ష' తర్వాత 'బ్రో' చేశాడు. ఆ మూవీలో చిన్న మావయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి యాక్ట్ చేశాడు. మామ అల్లుళ్లు కలిసి నటించిన ఫస్ట్ ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. 'బ్రో' తర్వాత సాయి తేజ్ నటించే సినిమా ఏది? అంటే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) 


తమన్నా భాటియా (Tamannaah Bhatia) పాన్ ఇండియా హీరోయిన్. ఆవిడకు భారత దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ముఖ్యంగా యువతలో తమన్నా అభిమానులు ఎక్కువ. అందుకని, ఆమెను వెతుక్కుంటూ పలు బ్రాండ్స్ వస్తున్నాయి. తమన్నాతో తమ బ్రాండ్ ప్రమోట్ అయ్యేలా యాడ్స్ వంటివి చేయించుకుంటూ సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు గాను భారీ మొత్తంలో ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. అయితే, ఓ యాడ్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. పోలీసుల నుంచి నోటీసులు వచ్చేలా చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Vijayashanti About Comeback Into Movies: విజ‌యశాంతి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కి పెట్టింది పేరు. ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. క్లాసు, మాసు, యాక్ష‌న్.. జోన‌ర్ ఏదైనా త‌నదైన శైలీలో యాక్టింగ్ చేస్తారు. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఆమె. అయితే, ఒక్క‌సారిగా సినిమాల‌కు బై చెప్పి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు విజ‌యశాంతి. ఇక ఆ త‌ర్వాత 13 ఏళ్ల‌కు సినిమా ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు ఆమె. 'స‌రిలేరు నీ కెవ్వ‌రు'లో చేశారు. అయితే, ఆ టైంలో ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విజ‌య శాంతి త‌ర్వాతి ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్ గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Are Shruti Haasan and Santanu Hazarika not dating anymore?: స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతను హజారికా డేటింగ్ విషయం ప్రేక్షకులకు తెలుసు. లవ్, రిలేషన్షిప్‌లో ఉన్న సంగతి ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు శ్రుతి హాసన్. శాంతనుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ, ఇప్పుడు చెయ్యడం లేదు. ఆ మాటకు వస్తే కొన్నాళ్లుగా ఆవిడ యాక్టివ్‌గా ఉన్నది లేదు. మ్యాటర్ ఏంటని ఆరా తీస్తే... బ్రేకప్ అయ్యిందనేది ముంబై మూవీ జనాల గుసగుస. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Pushpa 2 Sensational Surprise Awaited: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో 'పుష్ప 2' ఒకటి. అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ యాక్టింగ్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. తనదైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో బన్నీ అన్ని భాషల ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక పాటలకు వచ్చిన రెస్పాన్స్‌ అంతా ఇంత కాదు. ఎక్కడ చూసిన పుష్ప పాటలే మారుమోగాయి. ఇంటర్నేషనల్‌ వేదికలపై కూడా శ్రీవల్లి, ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా పాటలు ప్రదర్శన కూడా జరిగింది. అంతగా పుష్ప మూవీ, పాటలు సన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. అందుకే పుష్ప 2 ఆడియోకి ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది. రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' ఆడియో రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Also Read: యాంకర్‌ సుమ, ఉదయభాను అలా - టాలీవుడ్‌ యాంకర్లపై వింధ్య విశాఖ షాకింగ్ కామెంట్స్‌