ఇదీ మహేష్ బాబు క్రేజ్ - గంటలో హౌస్‌ఫుల్ బోర్డ్స్!


సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) స్టామినా ఏంటి? అనేది 'బిజినెస్‌ మేన్' రీ రిలీజ్ (Businessman Re Release) మరోసారి చాటి చెబుతోంది. మహేష్ బాబు కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ 'బిజినెస్‌ మేన్' తెరకెక్కించారు. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చి సుమారు 11 ఏళ్ళు అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2012లో విడుదల కాగా... అప్పట్లో 90 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మహేష్ బాబు పుట్టిన రోజు (Mahesh Babu Birthday) కానుకగా ఈ నెల 9న 'బిజినెస్‌ మేన్' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లో ఆయనకు మామూలు క్రేజ్ లేదని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


మట్టితో బొమ్మలు, ఫ్రెండ్స్‌తో సమంత సరదాలు- బాలిలో జాలీగా గడుపుతున్న సామ్


కొంత కాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించిన అందాల తార సమంత, ప్రస్తుతం వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. తన ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాకు వెళ్లిన సమంత, ప్రస్తుతం బాలిలో ప్రకృతి అందాలను తిలకిస్తోంది. అక్కడి అద్భుత దృశ్యాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


టాలీవుడ్ నాకు మరో కుటుంబంలా మారిపోయింది - బర్త్ డే వేడుకల్లో మృణాల్ ఠాకూర్


‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ వైపు న్యాచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు తాజాగా విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన పనులు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా రీసెంట్ గా మూవీ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఈ మూవీ సెట్స్ లో ఉంది. నేడు(ఆగస్టు 1) మృణాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె తన బర్త్ డే వేడుకలను ‘విడి 13’ సెట్స్ జరుపుకుంటోంది.  ఈ సందర్భంగా మూవీ నటీనటులు, సిబ్బంది ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 


సెన్సార్‌తో అంత వీజీ కాదు, 27 మార్పులతో అక్షయ్ సినిమా!


అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'ఓ మై గాడ్' (Oh My God 2 Movie). ఇందులో యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి ఇతర ప్రధాన తారాగణం. అప్పట్లో 'ఓ మై గాడ్' సంచలన విజయం సాధించింది. ఆ సినిమాను తెలుగులో 'గోపాల గోపాల' పేరుతో వెంకటేష్, పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా విజయం సాధించింది. అందుకని, 'ఓ మై గాడ్ 2' మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కొన్ని రోజులుగా సెన్సార్ విషయం వార్తల్లో నిలుస్తోంది. ఎట్టకేలకు 'ఓ మై గాడ్ 2'  సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. అదీ 27 మార్పులతో (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)!


బాలీవుడ్ మూవీ కోసం కొత్త లుక్‌లో కీర్తి సురేష్? మేకోవర్ అదిరిందిగా!


సౌత్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆమె రీసెంట్ గా నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తమిళంలో 'మామన్నన్' సూపర్ డూపర్ హిట్ అందుకోగా, తెలుగులో నటించిన నాని 'దసరా', మహేష్ బాబు  'సర్కారు వారి పాట' సినిమాలు మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది.  తన తొలి హిందీ మూవీలో వరుణ్ ధావన్‌తో జోడీ కట్టబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్‌ దళపతి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘తేరి’ హీందీలోకి రీమేక్ కాబోతోంది. ఇందులో హీరోగా వరుణ్ ధావన్, హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial