సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) స్టామినా ఏంటి? అనేది 'బిజినెస్‌ మేన్' రీ రిలీజ్ (Businessman Re Release) మరోసారి చాటి చెబుతోంది. ప్రేక్షకుల్లో ఆయనకు మామూలు క్రేజ్ లేదని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


ఆగస్టు 9న 'బిజినెస్‌మేన్' రీ రిలీజ్
మహేష్ బాబు కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ 'బిజినెస్‌ మేన్' తెరకెక్కించారు. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చి సుమారు 11 ఏళ్ళు అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2012లో విడుదల కాగా... అప్పట్లో 90 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 


మహేష్ బాబు పుట్టిన రోజు (Mahesh Babu Birthday) కానుకగా ఈ నెల 9న 'బిజినెస్‌ మేన్' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ విశాఖలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. విశాఖపట్టణంలోని ప్రముఖ థియేటర్లలో ఒకటైన శరత్ సంగంలో ఉదయం 7.30 గంటలకు రెండు షోలు వేస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలో ఆ రెండు షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. 


ఊర్వశి థియేటర్ డాల్బీ 2కెలో సాయంత్రం ఆరు గంటలకు మరో షో వేస్తున్నారు. ఆ షో అడ్వాన్స్ బుకింగ్స్ లేటెస్టుగా ఓపెన్ చేశారు. ఫాస్ట్ ఫిల్ అవుతున్నాయి. ఒక్క విశాఖలో మాత్రమే కాదు... అనకాపల్లి, హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి ఏరియాల్లోనూ, అమెరికాలోనూ 'బిజినెస్ మేన్' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 


రీ రిలీజుల్లో సూర్య భాయ్ సెన్సేషన్!
మహేష్ క్రేజ్ చూస్తుంటే... బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం, వెంటనే హౌస్ ఫుల్స్ అయ్యేలా ఉన్నాయి. రీ రిలీజ్ సినిమాల్లో కలెక్షన్స్ పరంగా 'బిజినెస్  మేన్' రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.


'బిజినెస్ మేన్'లో సూర్య భాయ్ పాత్రలో మహేష్ బాబు నటించారు. ఈ సినిమాలో ఆయన సరసన  తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేశారు. ఇంకా ప్రకాష్ రాజ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముంబైకి వచ్చిన సూర్య భాయ్... అక్కడ ఉన్న మాఫియా, రౌడీలను ఎలా తన గ్రిప్ లోకి తెచ్చుకున్నాడు? ఆల్రెడీ ఉన్న మాఫియాకు ఎలా ఎదురు వెళ్ళాడు? ఏకంగా సిటీ కమిషనర్ కుమార్తెను ఎలా ప్రేమలో పడేశాడు? ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ... అతని పతనం కోసం సూర్య భాయ్ పని చేయడానికి గల కారణం ఏమిటి? అనేది 'బిజినెస్ మేన్' కథ.


Also Read : ఓ మై గాడ్ - సెన్సార్‌తో అంత వీజీ కాదు, 27 మార్పులతో అక్షయ్ సినిమా!


రాజమౌళి సినిమా అప్డేట్... 
'గుంటూరు కారం' గురించీ! 
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. 'అతడు', 'ఖలేజా' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమా అది. మహేష్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా గురించి ఓ అప్డేట్ రానుంది. 'గుంటూరు కారం' తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. ఆ పాన్ ఇండియా సినిమా అప్డేట్ కూడా ఆగస్టు 9న వచ్చే అవకాశం ఉందని సమాచారం. 


Also Read వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial