Doctor Post on Samantha Podcast: స్టార్‌ హీరోయిన్‌ సమంత పాడ్‌కాస్ట్‌ ప్రజలను తప్పుదొవ పట్టించేలా ఉందని, ఎలాంటి అవగాహన లేకుండానే ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాలేయ నిపుణులు‌ మండిపడ్డారు. సమంత పాడ్‌కోస్ట్‌ వీడియోను ట్యాగ్‌ చేసి ఈ మేరకు ఆయన తన ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. ది లివర్‌ డాక్టర్‌(TheLiverDoc) ప్రస్తుతం ఆయన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. కాగా సమంత రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అంతకుముందే సమంత పాడ్‌కాస్ట్‌తో పలకిరించింది. దీని ద్వారా ప్రజల్లో హెల్త్ అవేర్ నెస్ పెంచుతుంది.


ఇటీవల మయోసైటిస్‌ వ్యాధి బారిన పడ్డ ఆమె ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పాడ్‌కాస్ట్‌ మొదలుపెట్టి ప్రముఖ నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా సామ్‌ కాలేయ వ్యాధి గురించి ఓ వెల్ నెస్ కోచ్‌తో చర్చించింది. ఈ సందర్బంగా ఆయన ద్వారా పలు సూచనలు చెప్పించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలోకాలేయ శుద్ధికి డాండెలిన్ అనే పూల మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందని సదరు వెల్ నెస్ కోచ్ సూచించారు. అయితే ఇది నిజం కాదని, సమంత పాడ్‌కాస్ట్‌ తప్పుదొవ పట్టించేలా ఉందని తాజాగా డాక్టర్‌ లివర్‌ స్పెషలిస్ట్‌‌ మండిపడ్డారు. ఆయన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. 


Also Read: అదీ 'వంటలక్క' క్రేజ్‌ - 'కార్తీక దీపం 2'కి ప్రేమి విశ్వనాథన్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


"సినీ నటి సమంత గురించి నేను ఈ పోస్ట్‌ చేస్తున్నాను. ఆమె తన పాడ్‌కాస్ట్‌ ద్వారా తప్పుడు ప్రచారం, తప్పుడు సమచారంతో చేస్తూ 33 మిలియన్ల ఫాలోవర్స్‌ని తప్పుదొవ పట్టిస్తుంది. ఎలాంటి అవగాహన లేని వెల్‌ నెస్‌ కోచ్‌, న్యూట్రిషియన్స్‌తో తప్పుడు సమాచారం కల్పిస్తున్నారు. నేను మెడిసిన్ చదివి, కాలేయవ్యాధి వైద్యుడిగా పదేళ్లుగా రోగులకు సేవ చేస్తున్నాను. కాలేయాన్ని డెండాలిన్‌ అనే పూల మొక్క డీటాక్స్‌ చేస్తుందని సదరు వెల్‌నెస్‌ కోచ్‌ చెప్పారు. నిజానికి డాండెలైన్ అనేది ఒక కలుపు మొక్క. దీనిని సలాడ్‌లో వాడుతారు. 100 గ్రాముల డాండెలిన్ తీసుకుంటే శరీరానికి రోజువారీ అవసరమయ్యే పొటాషియంను 10 నుంచి 15 శాతం అందుతుందనేది ప్రచారంలో ఉంది. అలాగే ఇది మూత్ర ఉత్పత్తిగా(మూత్రం ఎక్కువ వచ్చేందుకు) తోడ్పడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగు పరుస్తుందని మరికొందరు చెబుతున్నారు. కానీ ఇది ఇంకా శాస్త్రియంగా నిర్ధారణ కాలేదు.






కానీ, సమంత , ఓ వెల్‌నెస్‌ కోచ్‌ డాండెలిన్‌ లివర్‌ని శుద్ధి చేస్తుందని చెప్పారు. ఇది ఎలాంటి అవగాహన లేకుండ చెప్పిన సమాచారం. అతడు నిజమైన వైద్యుడు కాదు, కాలేయం పనితీరు గురించి బహుశా ఆయనకు తెలియదు అనుకుంటా" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా డాండెలిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. చూస్తుంటే సదరు వెల్‌నెస్‌ కోచ్‌కు మానవ శరీరం పనితీరుపై ఖచ్చితమైన అవగాహన లేదని అనిపిస్తుంది. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అంతా చెత్త కంటెంట్‌, ఆరోగ్యంపై అర్థంలేని విషయాలే ఉన్నాయి. అలాంటి ఇద్దరు సైన్స్‌  నిరక్షరాస్యులు తమ అజ్ఞానాన్ని పంచుకుంటున్నారని మండిపడ్డారు. డాండెలైన్‌లను ఉపయోగకరమైనదిగా చూపే ఏకైక విషయం రూత్ బి రచించిన డాండెలియన్స్ పాట. దీన్ని తనిఖీ చేయండి.