Ram Pothineni’s stylish police look from The Warriorr unveiled: రాముడొచ్చాడు... ఉగాదికి స్టయిలిష్ రాముడొచ్చాడు... అదీ సూపర్ బైక్ వేసుకుని సూపర్ కాప్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు! ఆ స్టయిల్... ఆ స్వాగ్... ఆ క్లాస్... మాస్ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునేలా ఉంది. 'ది వారియర్' సినిమాలో రామ్ (Ram Pothineni New Look - The Warrior Movie) లుక్ ఇది!
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కుతోన్న సినిమా 'ది వారియర్' (The Warrior Movie). శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. లింగస్వామి (N Lingusamy) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా... సినిమాలో రామ్ స్టయిలిష్ లుక్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్రనిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "ప్రేక్షకులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా 'ది వారియర్'లో స్టయిలిష్ రామ్ లుక్ విడుదల చేశాం. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన మరో లుక్‌కు రెస్పాన్స్ బావుంది. అయితే... లేటెస్ట్ లుక్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ లభించింది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రతి లుక్ సినిమాపై అంచనాలు పెంచింది" అని చెప్పారు.
Also Read: అనుష్కా శెట్టి - నవీన్ పోలిశెట్టి - మూడు రోజుల్లో మళ్ళీ మొదలు!
ప్రస్తతం హైదరాబాద్‌లో హీరో హీరోయిన్లు రామ్, కృతి శెట్టిలపై భారీ సెట్స్‌లో పాట చిత్రీకరిస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: ఆస్కార్ చెంప దెబ్బ ఇష్యూ - విల్ స్మిత్ అరెస్టుకు రంగం సిద్ధం, కానీ రాక్ మాత్రం!