అనుష్క శెట్టి (Anushka Shetty) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న తాజా సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. త్వరలో కొత్త షెడ్యూల్ (Anushka Latest Movie Update) కూడా స్టార్ట్ కానుంది.


అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి .(Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా (Anushka 48) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కొంత షూటింగ్ చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.


Also Read: 'శర్మాజీ న‌మ్‌కీన్‌' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?


అనుష్కకు 48వ చిత్రమిది. 'మిర్చి', 'భాగమతి' విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా (Anushka Shetty hat trick  movie with UV Creations). ఇందులో ఆమె సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ వెల్లడించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.