యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే ఈ సినిమా రెండొందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. సినిమాలో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉండడం, ఎన్టీఆర్-రామ్ చరణ్ లను ఒకే తెరపై చూసే ఛాన్స్ రావడంతో ఎవరూ సినిమాను మిస్ అవ్వడం లేదు.
ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా.. 'ఆర్ఆర్ఆర్' మేనియా మాత్రం తగ్గడం లేదు. ఈ వారం రోజుల్లో సినిమా ఏడు వందల కోట్లకు పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రేక్ లేకుండా దూసుకుపోతున్న ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ సినిమాను మొత్తం ఐదొందల కోట్లతో నిర్మించారు. ఏడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం విశేషం.
ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ని పెంచే పనిలో పడింది 'ఆర్ఆర్ఆర్' టీమ్. త్రీడీ వెర్షన్ ను చాలా తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పుడు త్రీడీ థియేటర్లను పెంచుతున్నారు. అలానే కొన్ని చోట్ల టికెట్ రేట్లు తగ్గడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఉగాది పండగ ఉంది కాబట్టి ఈ వారాంతంలో 'ఆర్ఆర్ఆర్' మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.
Also Read: లైంగిక వేధింపుల కేసు - 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్ పై చార్జ్‌షీట్