అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కథానాయకుడిగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'థాంక్యూ' (Thank You Telugu Movie). 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ రోజు అనౌన్స్ చేశారు. (Telugu Movie Thank You Release Date)


''థియేటర్లలో జూలై 8న నాగచైతన్య అక్కినేని 'థాంక్యూ' మేజిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌ చేయడానికి రెడీ అవ్వండి'' అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. 






'థాంక్యూ'లో చైతన్య బాక్సింగ్ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసిన పీసీ శ్రీరామ్, ఈ సినిమాలో చైతన్య తన బెస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.


Also Read: విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇచ్చిన పూజా హెగ్డే, ఎన్ని రోజులు అంటే?






నాగచైతన్య సరసన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు... రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించగా... ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ