తెలుగు చిత్ర పరిశ్రమలో డేట్స్ అసలు ఖాళీ లేని కథానాయకులలో రవితేజ ఒకరు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'ధమాకా' సినిమాలు సెట్స్ మీద ఉన్నారు. మూడు నాలుగు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమాల తర్వాత తమిళ దర్శకుడితో రవితేజ ఒక సినిమా చేయనున్నారట.
'బొమ్మరిల్లు' ఫేమ్ సిద్ధార్థ్ హీరోగా నటించిన 'లవ్ ఫెయిల్యూర్' సినిమా గుర్తుందా? దాంతో బాలాజీ మోహన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ధనుష్ హీరోగా 'మారి', 'మారి 2' సినిమాలు తీశారు. రవితేజతో సినిమా చేయాలని కొన్ని రోజులుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బాలాజీ మోహన్ చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలిసింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: ‘మనీ హీస్ట్’ కొరియా డేట్ ఫిక్స్, ప్రొఫెసర్‌గా యూ జీ-టే, ఫస్ట్ లుక్ చూశారా?
Also Read: టేబుల్ ఫ్యాన్‌లో చున్నీ, ఇది చాలా ఫన్నీ! ఇలా కూడా చచ్చిపోవచ్చా? ఈ సీన్ చూస్తే పడిపడి నవ్వేస్తారు!