మీరు టీవీ సీరియల్స్ అతిగా చూస్తుంటారా? అయితే, మీకు ఇలాంటి సీన్లు కొత్త కాకపోవచ్చు. తల, తోకలేని కొన్ని సీరియల్స్ చూస్తే భలే నవ్వు వస్తుంది. కొంపదీసి ఆ సీరియల్ దర్శకులు, అతడి టీమ్ బుర్రను ఇంట్లో పెట్టి వచ్చి ఉంటారా అని ఆశ్చర్యం కలుగుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి సీన్స్ కనిపిస్తే చాలు.. నెటిజనులు వైరల్ చేసేస్తున్నారు. తాజాగా మరో సీరియల్ సీన్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతుంది. 


ఇందులో ఓ యువతి(సంగీత ఘోష్) తన చున్నీని వెనక్కి వేసుకుంటుంది. దీంతో ఆ చున్నీ ఎగిరి ఫ్యాన్‌ రెక్కల్లో పడుతుంది. చున్నీ మెడకు బిగుసుకుంటుంది. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంటుంది. ఇంతలో అక్కడే ఉన్న మరో వ్యక్తికి వచ్చి ఆమెను విడిపించేందుకు విఫలయత్నం చేస్తాడు. మరో యువతి ఆ ఫ్యాన్‌కు ఉన్న ఫ్లగ్‌ను తీసేసి ఆమెను కాపాడాలని అనుకుంటుంది. కానీ, బ్యాడ్ లక్ అది ఆ ఫ్లగ్ బిగుసుకుపోతుంది. ఫ్యాన్ రెక్కల్లో చున్నీ మరింత బిగుసుకుంటుంది. వేరే దారి లేకపోవడంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి చున్నీని ఎలకలా కొరికేస్తాడు. ఎట్టకేలకు ఆమెను రక్షిస్తాడు. 


Also Read: 'సర్కారు వారి పాట' ఫేక్ కలెక్షన్స్ - ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తోన్న నెటిజన్లు


ఈ సీన్ ‘స్వర్ణ ఘర్’ సీరియల్‌‌లోనిది. చున్నీ ఫ్యాన్‌లో పడే సీన్ బాగానే ఉంది. కానీ, ఇక్కడ దర్శకుడు చాలా లాజిక్కులు మరిచిపోయాడు. 1. చున్నీలో ఒక కొన మాత్రమే ఫ్యాన్‌లో పడుతుంది. అంటే రెండో కొన ఆమె చేతిలోనే ఉంటుంది. దాని తీస్తే సమస్య తీరిపోతుంది. కానీ, అలా చేయరు. 2. అది టేబుల్ ఫ్యాన్.. గట్టిగా లాగితే కిందపడిపోతుంది. కానీ అది జరగదు. 3. ఆమెకు మెడ చున్నీ బిగుసుకోకుండా ఉండాలంటే ఫ్యాన్ వద్దకు వెళ్లి చున్నీని పట్టుకుంటే చాలు. కానీ, అది కూడా చేయరు. 4. ఆ ఫ్యాన్ ఫ్లగ్ పెట్టిన బోర్డుకు స్విచ్ ఉండదు. కనీసం ఆ బోర్డుకు కనెక్షన్ ఇచ్చిన బోర్డుకు ఉండే స్విచ్ ఆపినా సరిపోతుంది. కానీ, అది కూడా చేయరు. 5. అక్కడ ఉన్నవాళ్లంతా డాక్టర్లే.. ఆమె అలా విలవిల్లాడుతుంటే ఒక్కరు కూడా ముందుకురారు. ఆమెను విడిపించే ప్రయత్నం చేయరు. 7. ఆ చున్నీ ఫ్యాన్‌లో పడేప్పుడు ఫ్యాన్ ఊచలు బాగానే ఉంటాయి. ఆ తర్వాత అవి విరిగిపోయి ఉంటాయి. ఇంకా వెతుకుతూ పోతే చాలా లాజిక్కులు దొరుకుతాయి. ఆ ఫన్నీ సీన్‌ను ఇక్కడ చూడండి. 






Also Read: నయనతారతో ధోనీ సినిమా - క్లారిటీ ఇచ్చిన టీమ్