ప్రముఖ ఛానెల్ స్టార్ మా కొత్త షోను మొదలుపెడుతోంది. ఇప్పటికే ఈ ఛానెల్ లో వచ్చిన డాన్స్ షోలు, కామెడీ షోలు, సింగింగ్ షోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మరో షోతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అదే 'సూపర్ సింగర్ జూనియర్'. మే 22న ఈ షోని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. దీనికి అనసూయ, సుధీర్ లు హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. 


ఈ షోలో 14 మంది సూపర్ టాలెంటెడ్ కిడ్స్ పోటీ పడబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. రేపటి సంగీత సామ్రాజ్యాన్ని ఏలే తారలు అంటూ చిన్నారులను పరిచయం చేశారు. ఈ పిల్లలు స్టేజ్ పైకి రాగానే.. సుధీర్, అనసూయలకు పంచ్ లు వేశారు. దీంతో వారు పిల్లలను హ్యాండిల్ చేయడం కష్టమే అంటూ పేరెంట్స్ వైపు చూశారు.


 ఇక ఈ షోకి జడ్జిలుగా సింగర్ మనో, చిత్ర, హేమచంద్ర, రణీనా రెడ్డి వ్యవహరించనున్నారు. స్టేజ్ పైకి వచ్చిన వీరు తమ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. చిత్ర అయితే బాలయ్య డైలాగ్ 'ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..' అంటూ రోరింగ్ వాయిస్ లో చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. 


ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో ఈటీవీ ఛానెల్ లో పాపులర్ అయిన చాలా మంది కమెడియన్స్, యాంకర్స్.. స్టార్ మాకి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు సుధీర్, అనసూయ కూడా మల్లెమాల నుంచి స్టార్ మాకి వచ్చారంటే మరి 'జబర్దస్త్' సంగతి ఏమవుతుందో..? లేకపోతే ఈ రెండు షోలను మ్యానేజ్ చేసేలా డీల్ చేసుకున్నారేమో తెలియాల్సివుంది!