సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది కానీ సామాన్య ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోతుంది. 


సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మన్స్ కి ఎవరూ వంకలు పెట్టడం లేదు కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేదని పెదవి విరుస్తున్నారు. ఇలాంటి కథను మహేష్ తన భుజాలపై నడిపించారని అంటున్నారు. సినిమాకి కొన్ని ఏరియాల్లో నెగెటివ్ టాక్ వస్తుండడంతో బుకింగ్స్ కూడా సరిగ్గా జరగడం లేదు. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదని టాక్. 


అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ.75 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్ వదిలారు. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. SVPFakeCollections అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో రెండొందల కోట్ల పోస్టర్ వేస్తారంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బుక్ మై షో స్క్రీన్ షాట్స్ ను షేర్ చేస్తూ.. టికెట్స్ అమ్ముడు కావడం లేదంటూ ప్రూఫ్ లు చూపిస్తున్నారు. ఈ నెగెటివ్ ట్వీట్స్ ను మహేష్ బాబు ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. కావాలనే తమ హీరో సినిమాను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!


Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?