‘మనీ హీస్ట్’ వెబ్ సీరిస్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో మీకు తెలిసిందే. స్పానిష్‌‌కు చెందిన ఈ షో తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా విడుదలైంది. ఐదు సీజన్లతో ఈ షోను ముగించారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, కొరియాలో మళ్లీ ‘మనీ హీస్ట్’‌ను రీమేక్ చేస్తున్నారు. స్పానిష్ ‘మనీ హీస్ట్’లో అల్వారో మోర్టే పోషించిన ప్రొఫెసర్ పాత్రలో యూ జీ-టే నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ‘నెట్‌ఫ్లిక్స్ కొరియా’ ప్రొఫెసర్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. 


మరో గుడ్ న్యూస్ ఏమిటంటే ‘Money Heist: Korea – Joint Economic Area’ సీజన్-1‌.. జూన్ 24 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్ కానుంది. ఒరిజనల్ ‘మనీ హీస్ట్’లో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ వెబ్ సీరిస్ అభిమానులు అందులోని పాత్రల గురించి నిద్రలో అడిగినా తడబడకుండా చెప్పేస్తారు. ప్రొఫెసర్‌తోపాటు బెర్లిన్, టోక్యో, రియో, హెల్సింకీ, నైరోబీ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ ప్లాన్స్.. ఏ క్షణంలో ఎలాంటి ఎత్తులు వేస్తాడనేవి ఎవరికీ అంతుబట్టకుండా ఉంటాయి. అందుకే ఈ షో అందరికీ నచ్చేసింది.


Also Read: ఓటీటీలో RRR వచ్చేది ఈ తేదీనే, అదనంగా నగదు చెల్లించాలా?


మరి, ‘మనీ హీస్ట్’ కొరియాలో అదే కథను మళ్లీ చూపిస్తారా? లేదా ఏమైనా మార్పులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఇది ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా’లో విడుదల అవుతుందా లేదా అనేది కూడా సందేహమే. అయితే, ఇండియాలో కొరియా వెబ్ సీరిస్‌లకు మంచి ఆధరణ ఉన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరిస్ కూడా విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 


Also Read: మహేష్ 'సర్కారు వారి పాట' ఓటీటీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?