‘బిగ్ బాస్’ చివరి దశకు చేరుకుంది. దీంతో కంటెస్టెంట్లలో టెన్షన్ మొదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. ఇక నామినేషన్లలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. బిందు, నటరాజ్ మాస్టర్‌ల మధ్య శత్రుత్వంగా బాగా పెరిగిపోయింది. నామినేషన్ల విషయంలో బిగ్ బాస్.. కంటెంస్టెంట్లు అందరికీ షాకిచ్చాడు. ఈ వారం అంతా నామినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం హౌస్‌లో మిత్రా శర్మ, బాబా భాస్కర్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, నటరాజ్ మాష్టార్మ్ అరియనా, అఖిల్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.
అనసూయ ఎంట్రీ: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి యాంకర్, నటి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టార్ అమ్మాయి వేషంలో ఎంట్రీ ఇచ్చారు. ‘‘బావొచ్చాడోయ్ మామ..’’ పాటకు నాటు స్టెప్పులతో ఇరగదీశారు. ఈ ప్రోమో చూసిన నెటిజనులు ‘పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్’ అని కామెంట్లు చేస్తున్నారు. అనసూయ.. హౌస్‌మేట్స్‌కు ఆడియన్స్ వేసిన పలు ప్రశ్నలను అడిగింది. అరియానా, అఖిల్‌ను ఉద్దేశిస్తూ ఫ్యామిలీ వచ్చిన తర్వాత బిందుకు ఎందుకు క్లోజ్ అయ్యారని పలువురు ప్రశ్నించారు. వీటికి వారు ఏం సమాధానం చెప్పారో తెలియాలంటే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!
బిందు, నటరాజ్ మధ్య మాటల యుద్ధం: నామినేషన్లు సందర్భంగా బిందు, నటరాజ్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. నటరాజ్ బిందు, బాబా మాస్టర్, అరియానాలను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా బిందు, నటరాజ్‌ల మధ్య వాగ్వాదం నెలకొంది. ‘‘నెగటివిటీ కంప్లీట్‌గా ఉన్న ఓన్లీ వన్ పర్శన్ నువ్వు మాత్రమే’’ అని నటరాజ్ వ్యాఖ్యానించాడు. ‘‘నీ సైడ్ నుంచి ఏమి వచ్చింది ఇన్ని రోజులు? పాజిటివిటీనా?’’ అని బిందు మాధవి ఎదురు ప్రశ్నించింది. ‘‘ఇప్పటివరకు బిందు చేసినవన్నీ దొంగ నామినేషన్లే’’ అని కెమేరాల వైపు తిరిగి నటరాజ్ చెప్పాడు. కెమేరాలకు ఎందుకు చెబుతున్నారని బిందు మాధవి అడిగితే.. ‘‘నీ ఫేస్ చూడలేక కెమేరాలకు చెబుతున్నా. నీ కళ్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో, నరాలన్నీ ఎక్కడ పగిలిపోతాయో అని భయమేసి.. నేను అటగు చూస్తున్నా. ‘‘శూర్పణక నీ టైమ్ ఆసన్నమైంది. ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు’’ అని నటరాజ్ కామెంట్ చేశారు. దీంతో బిందు మాధవీ ఏమీ మాట్లాడకుండా దుర్గ మాత పోజులో నటరాజ్‌కు సమాధానం ఇచ్చింది. ఈ ప్రోమో చూసి నెటిజనులు నటరాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాస్త ఓవర్‌గా మాట్లాడుతున్నారని అంటున్నారు.
Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?