మిళ హీరో విజయ్ తొలిసారి ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌కు తెలుగులోనూ మాంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వంశీ కొద్ది రోజుల్లోనే మేజర్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ పోస్టర్‌ను ఆయన అభిమానులతో పంచుకున్నారు. విజయ్‌తో వంశీ పైడిపల్లి మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇందులో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందాన్న, మెహ్రీన్‌లు నటించనున్నారు. ఎక్కువగా యాక్షన్ సినిమాలకే మొగ్గుచూపే విజయ్ ఈసారి కుటుంబ నేపథ్యం కలిగిన కథలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ సినిమా తరహాలో ఉంటుందని తెలిసింది. సాధారణంగా పెద్ద హీరోలతో సినిమాలంటే కొన్ని నెలల వ్యవధి పడుతుంది. అయితే, మేజర్ షెడ్యూల్ రెండు నెలల్లోనే పూర్తి చేయడంతో మరీ ఇంత త్వరగానా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు మరో షెడ్యూల్ మిగిలి ఉంది. ప్రస్తుతానికైతే విజయ్‌తో ఉన్న సీన్స్ అన్నీ పూర్తి చేసినట్లు తెలిసింది. 


Also Read: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్


వరుసగా యాక్షన్, డ్రామా చిత్రాలకే పరిమితమైన విజయ్ ఈ సారి రూట్ మార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకే, వంశీ చెప్పిన ఫ్యామిలీ స్టోరీ విని వెంటనే విజయ్ ఒకే చెప్పారని తెలుస్తోంది. పైగా వంశీ, దిల్ రాజులు తెలుగులో సక్సెస్‌ఫుల్ దర్శక, నిర్మాతలు కావడం వల్ల ఈ ప్రాజెక్టుపై విజయ్ ఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ చిత్రంలో విజయ్‌కు తండ్రిగా శరత్ కుమార్, అన్నగా ‘కిక్’ శ్యామ్ నటిస్తున్నట్లు తెలిసింది. ‘బీస్ట్’ పరాజయం నేపథ్యంలో విజయ్ అభిమానులు ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను 2023, సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 


Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?