Balakrishna Daughter Tejaswini Nandamuri: తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ ఓ శక్తివంతమైన పేరు. తెలుగు సినిమాకు సింబల్‌గా నిలిచిన నందమూరి తారక రామారావు నట వారసుడు. తండ్రి వారసత్వాన్ని.. కీర్తిని పెంచేలా బాలకృష్ణ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ 50 ఏళ్లలో ఎన్నో ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చినా బాలకృష్ణ అంతే స్థాయిలో డిజాస్టర్‌లు కూడా ఇచ్చారు. కొంతకాలం క్రితం అయితే... ఆయన సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అవుతూ ఇక హీరోగా ఆయన కెరీర్ అయిపోయినట్లే అనే దశలో 'అఖండ'తో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు. 

'అఖండ'తో బాలయ్య మొదటి సారిగా వందకోట్ల మార్క్‌కు చేరువయ్యారు. అక్కడ నుంచి ఆయన ప్రతీ అడుగూ వినూత్నంగా సాగింది. 'అఖండ' షాక్ నుంచి జనం తేరుకోకముందే.. 'అన్‌స్టాపబుల్' అంటూ టాక్ షోతో వచ్చేశారు. మొత్తం ఆయన 50 ఏళ్ల కెరీర్‌లో లాస్ట్ 5ఏళ్లు ఓ మహర్దశ. సినిమా సెలక్షన్, టేకింగ్, మేకింగ్, ట్రాన్స్‌ఫామింగ్ అన్నింటిలో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న శక్తి... ఆయన చిన్న కుమార్తె తేజస్విని.

తేజస్వినీ... ఓ క్రియేటివ్ పవర్‌హౌస్!నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు. వాళ్ల తర్వాత ఓ కుమారుడు ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే అమ్మాయిలెప్పుడూ సినీ, పబ్లిక్‌ లైఫ్‌లోకి రాలేదు. పెద్ద కుమార్తె బ్రాహ్మణి అయినా చంద్రబాబు కోడలిగా పబ్లిక్‌ లైఫ్‌లోకి వచ్చారు కానీ... మూడు నాలుగేళ్ల క్రితం వరకూ తేజస్వినీ గురించి ఎవరికీ తెలీదు. చిన్నప్పుడు బాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆమె... తర్వాత గీతమ్ విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్‌ను పెళ్లి చేసుకుని ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఆమె కొన్నాళ్లుగా బాలకృష్ణ మూవీస్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయన సినిమాల సెలక్షన్, బాలయ్య ఆహార్యం, కొత్త తరానికి అనుగుణంగా ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ వీటన్నింటి వెనుక ఉంటోంది ఆమె. 

తేజస్వినీ కొన్నాళ్లుగా ఓ కొత్త బాలయ్యను చూపిస్తున్నారు.  సోషల్ మీడియా యుగంలో ఆడియన్స్  అభిరుచులు, ట్రెండ్‌లు వేగంగా మారుతున్న సమయంలో, తేజస్విని తన తండ్రి సినిమాలను, ప్రాజెక్ట్‌లను ఈతరం  ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. సినిమా సెలక్షన్‌ల దగ్గర నుంచి ప్రమోషన్‌ల వరకూ బాలకృష్ణ విషయంలో అన్నీ తానే చూస్తున్నారు. 

అన్‌స్టాపబుల్: తేజస్విని మాయాజాలం'అన్‌స్టాపబుల్' ఓ కొత్త బాలకృష్ణను లోకానికి పరిచయం చేసిన కార్యక్రమం. అభిమానులే కాదు... మామూలు ఆడియన్స్ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని బాలయ్యను చూశారు. ఈ ప్రోగ్రామ్‌లో క్రియేటివ్ సైడ్ తేజస్విని పని చేశారు. అప్పుడే బాలకృష్ణ కూతురు ఆయన కెరీర్‌లోకి ఎంటర్‌ అయ్యారన్న విషయం జనాలు తెలిసింది. ఆవిడ సృజనాత్మకత, బాలకృష్ణ టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్, సమయస్ఫూర్తి, ఆహా దానిని టేకప్ చేసిన విధానం అన్నీ కలగలసి ఆ షోను ఇండియాలోనే బెస్ట్ రీజనల్ ఓటీటీ షో గా నిలిపాయి. దీంతో తేజస్వినీ టాలెంట్ బయటకు వచ్చింది.

Also Read: దాక్కున్నా…కానీ దొంగోడిని కాదు…ప్రణబ్ ముఖర్జీ వల్లే అంటూ తొమ్మిదేళ్ల తర్వాత నోరు విప్పిన విజయ్‌ మల్యా..

'అన్‌స్టాపబుల్‌'కు పని చేసినా చాలా కాలం తెరవెనుకనే ఉన్న ఆమె... Unstoppable Season 4 ద్వారా తెర ముందుకు కూడా వచ్చారు. ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 ఓపెనింగ్ ఈవెంట్‌లో తేజస్విని మీడియా ముందు మాట్లాడిన తీరు, ఆమె చురుకుదనం, కాన్ఫిడెన్స్  అభిమానులను ఆకట్టుకున్నాయి. ‘డాకు మహారాజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ తన కెరీర్‌లో ‘రెండవ ఇన్నింగ్స్’ ప్రారంభమైందని ప్రకటించారు. ఈ రెండవ ఇన్నింగ్స్‌ను తేజస్విని నడిపిస్తున్నారని కూతురు గురించి చెబుతూ మురిసిపోయారు. “నా తొలి ఇన్నింగ్స్ తండ్రి ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో సాగింది. ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్‌ను నా కూతురు తేజస్విని సమర్థవంతంగా నడిపిస్తోంది” అని బాలకృష్ణ అన్నారు. 2021 నుంచి ఆయనకు అపజయమే లేదు. కరోనా తర్వాత జనం వస్తారో రారో అనుకుంటున్న తరుణంలో 'అఖండ' థియేటర్లలో మాస్ జాతర సృష్టించింది. ఆ తర్వాత 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకూ మహరాజ్‌' వంద కోట్ల మార్క్‌ను దాటేసి బాలకృష్ణలోని పీక్‌ను పరిచయం చేశాయి. 

కేవలం సినిమాల్లో ఆయన రూపు రేఖలను, స్టైల్‌ను మార్చడం మాత్రమే కాదు... బాలకృష్ణను ఓ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా తేజస్వినీ మార్చేశారు. ఇప్పుడు యూత్‌లో ఎక్కువుగా క్రేజ్ ఉంది యూత్‌ హీరోలకంటే బాలకృష్ణకే. "జై బాలయ్య" అనే మాట యూత్ ఊత పదంగా మారిపోయింది. యూత్‌లో పెరుగిన క్రేజ్‌ను ఆమె బ్రాండింగ్ చేశారు. అసలు సినిమాలు తప్ప మరో విధంగా ఎన్నడూ చూడిని బాలకృష్ణ హోస్ట్‌గా మారడమే కాక... అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు.

Also Readబాలకృష్ణ 2.0 లోడింగ్... పాన్ ఇండియా రేంజ్‌లో రుద్ర తాండవం - మాస్ జాతర గ్యారెంటీ

ఇప్పటి వరకూ జరిగిందే కాదు... ముందు ముందు ఉన్న లైనప్‌ కూడా భారీగా కనిపిస్తోంది. వచ్చే దసరాకు 'అఖండ-2', గోపీచంద్ మలినేని హిస్టారికల్ డ్రామా ఉన్నాయి. 'జైలర్‌-2'లో బాలయ్య నటిస్తున్నారని లీక్స్ వచ్చాయి తప్ప అనౌన్స్ చేయలేదు. 'మార్కో' డైరక్టర్ హనీఫ్ మూవీ, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ సినిమాలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. ఇలా ఈ లిస్ట్ చాలా ఎగ్జైటింగ్‌ గా కనిపిస్తోంది. 'అఖండ-2' టీజర్ చూశాక ఇక బాలకృష్ణకు తిరుగులేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 

తాను మొదటి నుంచీ క్రియేటివే- శ్రీ భరత్ తేజస్వినీకి చిన్నప్పటి నుంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. తనను ఎంకరేజ్ చేసుంటే... పెద్ద హీరోయిన్ అయ్యిండేవారని ఆమె భర్త, ఎంపీ శ్రీ భరత్ అన్నారు. తనలో క్రియేటివ్ జీన్స్ ఉన్నాయి. తను మంచి హీరోయిన్ అయ్యుండేది. కానీ తను స్టడీస్‌ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. తేజూ ఇన్వాల్వ్ అయ్యాక బాలకృష్ణ గారిలో చాలా మార్పు వచ్చింది. అన్‌స్టాపబుల్ చూశాం కదా.. అయితే బాలకృష్ణ గారి నేచర్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఆయన పూజలు, ఆయన పద్దతులు అన్నీ అలాగే ఉన్నాయి. అయితే తను వచ్చాక కొంచెం యంగ్ డైరక్టర్లతో ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. భగవంత్ కేసరి చూశాం కదా.. అసలు అది టిపికల్ బాలయ్య మూవీ కాదు. అయినా అంత సక్సెస్ అయింది. కొత్త ఆడియన్స్‌కు ఎలా దగ్గరవ్వాలని వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు." అని ABP DESAMతో చెప్పారు.

Also Read: రష్యాకు హాలీవుడ్ మూవీని లైవ్‌లో చూపించిన యుక్రెయిన్‌- ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ఎలా చేశారంటే..?