థియేటర్లలోకి 'కుబేర' (Kuberaa Movie)రావడానికి పది రోజుల సమయమే ఉంది. ఈ మూవీ సాంగ్స్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇంకా కంప్లీట్ చేయలేదని, ఆయన లేట్ చేస్తున్నారని కంప్లైంట్ ఒకటి ఉంది. ఫైనల్ ‌రికార్డింగ్ కంప్లీట్ కాలేదు కానీ ట్యూన్స్ అయితే ఇచ్చేశారట. దాంతో సినిమా ఫినిష్ చేసి సెన్సార్ కంప్లీట్ చేశారు. సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆడియన్స్ అందరూ షాక్ అయ్యేలా చేసింది.

Continues below advertisement

మూడు గంటల పదిహేను నిమిషాల సినిమా...అంత రన్ టైమ్ చూస్తారా? లెంగ్త్ ఇష్యూ అవుతుందా?'కుబేర' సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. దాంతో ప్రాబ్లం ఏమీ లేదు. అసలు సమస్య అంతా నిడివితో! ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ చూస్తే... రన్ టైమ్ మూడు గంటల 15 నిమిషాలు ఉంది.

'బాహుబలి', 'రంగస్థలం', 'యానిమల్' వెట్రిమారన్ 'విడుదల' వంటి సినిమాలు మూడు గంటల కన్నా ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ ఫిలిమ్స్ విజయాలు సాధించాయి. ఆ సినిమాలన్నీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, యాక్షన్ అండ్ డ్రామాతో కూడినవి. శేఖర్ కమ్ముల సెన్సిబుల్ సినిమాలు తీస్తారని పేరు ఉంది. ఆయన సినిమాల్లో డ్రామా బావుంది. క్యూట్ మూమెంట్స్ కూడా! అయితే శేఖర్ కమ్ముల సినిమాల పట్ల ప్రధానంగా వినిపించే విమర్శ నిదానంగా ముందుకు సాగుతాయని! 

Continues below advertisement

ఇప్పటి వరకు ఫీల్ గుడ్ ఫిలిమ్స్ తీసిన శేఖర్ కమ్ముల తొలిసారి తన జోనర్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగు పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే రన్ టైం పెద్ద సమస్య ఏమీ కాదు. ఏదైనా తేడా కొట్టినప్పుడు మళ్ళీ కత్తెరకు పని చెప్పాల్సి వస్తుంది. ఆ మధ్య రవితేజ సినిమాకు అలాగే చేశారు. శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డు బట్టి మూడు గంటల రన్ టైమ్ అంటే సాహసం అని ఆడియన్స్ అంటున్నారు.

Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్

సినిమా నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ మాత్రం థియేటర్లలోకి అంత సినిమా రాదని, ముందు జాగ్రత్తగా కంటెంట్ అంతా సెన్సార్ చేయించామని, మూడు గంటల లోపే 'కుబేర' ఉంటుందని చెబుతున్నారు. అది నిజమైతే ఎటువంటి సమస్య ఉండదు. లేదంటే ధనుష్, నాగార్జున మీద భారం అంతా పడుతుంది థియేటర్లలో అంతసేపు ప్రేక్షకులకు కూర్చోబెట్టాల్సిన బాధ్యత వాళ్ల మీద కూడా ఉంటుంది. ధనుష్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ జిమ్ షరాబ్ మరో కీలక పాత్ర చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమా రిలీజ్ అవుతోంది. 

Also Readనాగార్జున సినిమాలో సీన్ మక్కీకి మక్కీ దించేసిన మురుగదాస్... 'గజినీ'లో లవ్ ట్రాక్‌ ఒరిజినల్ కాదు, కాపీ... ఇదిగో ప్రూఫ్