కోలీవుడ్ కథానాయకుడు సూర్యకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ కావడానికి, ఇక్కడ ఒక మార్కెట్ రావడానికి కారణమైన సినిమాలలో 'గజినీ' ఒకటి. తమిళంలో హిట్ కావడంతో తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని నిర్మాత 'ఠాగూర్' మధు ట్రై చేశారు. డబ్బింగ్ చేయడం బెటర్ అని పవర్ స్టార్ ఇచ్చిన సలహాతో 'గజినీ' డబ్బింగ్ తెలుగులో రిలీజ్ అయింది. 'మొమెంటో' స్ఫూర్తితో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గజినీ తీశారని విమర్శలు ఉన్నాయి. మెమరీ లాస్ట్ కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేస్తే... లవ్ ట్రాక్ తెలుగు సినిమా నుంచి ఎత్తేశారు. 

నాగార్జున 'మురళీ కృష్ణుడు' సినిమా చూశారా?'గజనీ'లో లవ్ ట్రాక్ అక్కడ్నంచి లేపేశాడు!Nagarjuna's Murali Krishnudu: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'మురళీ కృష్ణుడు' సినిమా చూశారా? బహుశా... ఈ తరం ప్రేక్షకులకు ఆ సినిమా గురించి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే... 35 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రమది. 'మురళీ కృష్ణుడు'లో నాగార్జున టైటిల్ రోల్ చేశారు ఆయన పేరు మురళీ కృష్ణ. అతను ఒక మల్టీ మిలినియర్. అందులో రజిని హీరోయిన్. ఆవిడ క్యారెక్టర్ పేరు కృష్ణవేణి. ఆమె ఓ మెడల్ క్లాస్ అమ్మాయి. డ్రామా కంపెనీలో డాన్స్ టీచర్‌గా పని చేస్తుంది. ఒక రోజు డ్రామా కంపెనీ దగ్గర కృష్ణవేణిని మురళీకృష్ణ కార్ డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. దాంతో మురళీ కృష్ణకు కృష్ణవేణి క్లోజ్ అని, అతడి గర్ల్ ఫ్రెండ్ అని డ్రామా కంపెనీలో జనాలు అందరూ భావిస్తారు.

మురళీ కృష్ణ దగ్గర డొనేషన్ కోసం కృష్ణవేణిని కాకా మొదలు‌ పెడతాడు డ్రామా కంపెనీ ఓనర్. స్వలాభం కోసం కృష్ణవేణి కూడా తాను మురళీ కృష్ణ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు బిల్డప్ ఇస్తుంది.‌ కట్ చేస్తే ఆ డ్రామా కంపెనీ బిల్స్ అన్ని మురళీ కృష్ణ దగ్గరకు వెళ్తాయి. అసలు విషయం తెలిసి కృష్ణవేణికి గట్టిగా కోటింగ్ ఇద్దామని వెళ్తాడు మురళీ కృష్ణ. అయితే ఆమెను చూసే ప్రేమలో పడతాడు. తనను తాను మురళీ కృష్ణ కంపెనీలో బిల్ కలెక్టర్ కింద కృష్ణవేణికి పరిచయం చేసుకుంటాడు. అతడిని మురళీ కృష్ణ అని తన డ్రామా కంపెనీలో జనాలకు పరిచయం చేస్తుంది కృష్ణవేణి. ఒకచోట డొనేషన్ అడిగితే చెక్ రాసే ఇచ్చేస్తాడు. కింద ట్విట్టర్ పోస్టులో ఆ సీన్ చూడండి.

Also Read: ఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్

పైన 'గజినీ' సినిమాలో ఈ సీన్ ఏమైనా చూసినట్టు ఉందా? ఒక పెద్ద సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ సంజయ్ రామస్వామిగా 'గజినీ'లో సూర్య యాక్ట్ చేశారు. ఒక కేసు విషయంలో కల్పన హీరోయిన్ అసిన్ చేసిన క్యారెక్టర్ దగ్గరకు వెళ్తాడు. ఆవిడను చూసి ప్రేమలో పడతాడు తన ఐడెంటిటీ దాచి పెడతాడు. సేమ్ టు సేమ్ 'మురళీ కృష్ణుడు' సినిమాలో తరహాలో చెక్ రాసి ఇచ్చే సీన్ కూడా 'గజినీ'లో ఉంటుంది. దాంతో ఆ లవ్ ట్రాక్ అంతా 'మురళీ కృష్ణుడు' నుంచి మురగదాస్ ఎత్తేసాడని సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతున్నాయి. అసలే హిందీ 'సికిందర్' ఫ్లాప్‌తో డీలా పడ్డా దర్శకుడికి, ఆ సెటైర్స్ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా మారాయి.

Also Readబాలకృష్ణ 2.0 లోడింగ్... పాన్ ఇండియా రేంజ్‌లో రుద్ర తాండవం - మాస్ జాతర గ్యారెంటీ