వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్... వెండితెరపై గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ చెప్పిన సూపర్ హిట్ పంచ్ డైలాగుల్లో ఒకటి. హీరోగా తెలుగు తెరపై అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు హిస్టరీ క్రియేట్ చేశారు. తన తరం హీరోల్లో అన్ని జానర్స్ టచ్ చేసిన ఏకైక హీరో బాలకృష్ణ. సిల్వర్ స్క్రీన్ మీద ఆయనది 50 ఏళ్ళ ప్రయాణం. ఈ జర్నీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన బాలకృష్ణ... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు దాటి పాన్ ఇండియా రేంజ్‌లో తన స్టార్‌డమ్ చూపించేందుకు రెడీ అవుతున్నారు.

నందమూరి బాలకృష్ణ 2.0 లోడింగ్... ఈసారి టార్గెట్ పాన్ ఇండియా మార్కెట్!'అన్‌స్టాపబుల్' టాక్ షోతో బాలకృష్ణ 2.0 మొదలైందని కొందరు చెప్పే మాట. కానీ, అది కాదు... ఇప్పటి నుంచి చూడండి! బాలకృష్ణ 2.0 అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ప్రేక్షకుడూ చూసే రోజు దసరాకు రెడీ అవుతోంది.

బాలకృష్ణ భోళా శంకరుడు లాంటి మనిషి అని ఆయన్ను దగ్గర నుంచి చూసిన, చూసే జనాలు చెప్పే మాట. మనసులో ఒకటి, పైకి మరొకటి చెప్పే రకం కాదు. అయితే పబ్లిక్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వైరల్ కావడంతో ఆయనకు ఒక విధమైన ఇమేజ్ క్రియేట్ అయ్యింది. దాన్ని మార్చిన క్రెడిట్ 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి ఇవ్వొచ్చు. బాలకృష్ణ నటన విషయానికి వస్తే ఎప్పుడూ కంప్లైంట్స్ లేవు.

ప్రతి సినిమాలోనూ బాలకృష్ణ నటనకు క్లాప్స్ పడ్డాయి. ఆయన డైరెక్టర్స్ యాక్టర్. కథ, క్యారెక్టర్ కోసం ఏం చేయడానికి అయినా రెడీ. ఆయన డెడికేషన్ గురించి ముందు తరం ప్రేక్షకులకు తెలుసు. అయితే వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' నుంచి ఇప్పటి వరకు ఎక్కువ యువ దర్శకులతో బాలకృష్ణ పని చేయడంతో గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఏమిటో ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూలలో చెప్పడం వల్ల ఈ తరం ప్రేక్షకులకూ తెలిసింది. ఇప్పటి వరకు తెలుగు మార్కెట్‌లో బాలకృష్ణ సినిమాలు విడుదల అయ్యాయి. ఇప్పటి నుంచి పాన్ ఇండియా మార్కెట్‌లో రిలీజ్ అవుతాయి. 

'అఖండ 2 తాండవం'తో పాన్ ఇండియాకు...ఒక్కో సినిమాతో రేంజ్ మరింత పెంచుతూ!బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 'అఖండ 2 తాండవం'తో బాలకృష్ణ పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగు పెడుతున్నారు. 'అఖండ'కు నార్త్ ఇండియాలోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాను అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేయలేదు. కానీ, ఇప్పుడు ముందు నుంచి హిందీ మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేశారు. టీజర్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నారు.

బాలకృష్ణకు హిందీ వచ్చు. టీజర్ డబ్బింగ్ ఆయనే చెప్పారు. సినిమాకూ డబ్బింగ్ చెబుతారు. అందువల్ల, ఆయన వాయిస్‌లో పవర్ ఏమిటనేది హిందీ ప్రేక్షకులకూ తెలుస్తుంది. 'అఖండ' హిట్ కావడంతో 'అఖండ 2' మీద అంచనాలు పెరిగాయి. ఇక టీజర్ వాటిని మరింత పెంచింది. నార్త్ ఇండియాలో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకు ఆదరణ బావుంది. దాంతో 'అఖండ 2' భారీ విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.

Also Readబ్రాహ్మణులు వర్సెస్ మంచు ఫ్యామిలీ - గొడవ ఎప్పుడు మొదలైంది? 'కన్నప్ప' కాంట్రవర్సీ ఏమిటి? డిటైల్డ్ స్టోరీ

హిందీ మాత్రమే కాదు... త్వరలో బాలకృష్ణ తమిళ ప్రేక్షకుల ముందుకు సైతం వెళ్లేందుకు రెడీ అయ్యారు. రజనీకాంత్ 'జైలర్ 2'లో ఆయన నటించనున్న సంగతి తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ అయితే బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. తనతో 'వీర సింహా రెడ్డి' చేసిన గోపీచంద్ మలినేనికి బాలకృష్ణ మరో అవకాశం ఇచ్చారు. అది ఎన్‌బికె 111. రీసెంట్‌గా 'జాట్'తో హిందీలో హిట్ కొట్టారు గోపీచంద్ మలినేని. సో, బాలయ్యతో ఆయన చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు బాలకృష్ణ మాస్ ఎలా ఉంటుందో తెలుగు ఆడియన్స్ చూశారు. డబ్బింగ్ సినిమాల ద్వారా ఇతర భాషల ప్రేక్షకులు కూడా చూశారు. ఇప్పటి నుంచి 'అఖండ 2', 'జైలర్ 2', ఎన్‌బికె 111 నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ థియేటర్లలో బాలకృష్ణ మాస్ చూస్తారు.

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ