ప్రముఖ తమిళ హాస్య నటుడు సంతానం (Santhanam) హీరోగా రూపొందిన తాజా సినిమా 'డీడీ నెక్స్ట్ లెవెల్' (DD Next Level). 'దిల్లుకు దుడ్డు' ఫ్రాంచైజీలో నాలుగో చిత్రమిది. మే 16న థియేటర్లలో విడుదల అయింది. అతి త్వరలో ఈ సినిమా 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో...
రివ్యూ రైటర్లను టార్గెట్ చేసి చంపే దెయ్యం!
సంతానం కథానాయకుడిగా నటించిన 'డీడీ నెక్స్ట్ లెవెల్' సినిమాలో ఆయనకు జంటగా గీతికా తివారి నటించారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాషికా ఆనంద్ మరొక జంటగా కనిపించారు. ఇందులో సంతానం సిస్టర్ రోల్ చేశారు యాషిక.
'డీడీ నెక్స్ట్ లెవెల్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ 'జీ 5' సొంతం చేస్తుంది. థియేటర్లలో మే 16న విడుదలైన ఈ సినిమాను జూన్ 13 డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు 'జీ 5' పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వీక్షకులకు అందుబాటులో ఉంటుందని 'జీ 5' తెలిపింది.
Also Read: ఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్
'డీడీ నెక్స్ట్ లెవెల్' కథ విషయానికి వస్తే... కిస్సా (సంతానం) ఒక రివ్యూ రైటర్. హిచ్ కాక్ ఇరుదయరాజ్(సెల్వరాఘవన్) దర్శకుడు. రివ్యూ రైటర్లను అతడు టార్గెట్ చేస్తాడు. సినిమా ప్రీమియర్ షో వేస్తున్నామని, చూడటానికి వ్యక్తిగతంగా రమ్మని రివ్యూ రైటర్లు ఒక్కొక్కరికీ అతను ఆహ్వానాలు పంపిస్తాడు. కిస్సా కూడా ప్రీమియర్ అనుకుని వస్తాడు. హాలులో అడుగు పెట్టిన తర్వాత కిస్సా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది.
కిస్సాను దెయ్యాలు, భూతాలు ఉండే క్రూయిజ్‌లోకి పంపిస్తాడు హిచ్ కాక్ ఇరుదయరాజ్. అక్కడ నుంచి మరో దీవికి వెళాల్సి వస్తుంది. క్రూయిజ్ & దీవిలో అతని తల్లిదండ్రులు వేర్వేరు వ్యక్తులుగా కనిపిస్తారు. కిస్సా గాళ్ ఫ్రెండ్ ఆత్మగా మారుతుంది. ఎందుకలా జరిగింది? కిస్సాతో పాటు అక్కడ ఇరుక్కున్న మరో ఇద్దరు రివ్యూ రైటర్లు దాన్నుంచి బయట పడటం కోసం డైరీలో విషయాలను డీకోడ్ చేయటానికి సిద్ధమైన తర్వాత ఏం జరిగింది? అక్కడ అతింద్రీయ శక్తుల బలహీనతలు ఎలా గుర్తించారు? చివరకు ఎలా బయట పడ్డారు? ఈ ప్రయాణంలో ఎన్ని ఫీట్స్ చేశారు? అనేది సినిమా.
ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'డీడీ నెక్స్ట్ లెవెల్' సినిమాను ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల సహకారంతో వెంకట్ బోయినపల్లి, ఆర్య నిర్మించారు. ఇందులో తిరుపతి ప్రస్తావనతో రాసిన ఒక పాట వివాదాస్పదం కాగా... గౌతమ్ మీనన్, యాషిక మీద 'ఘర్షణ'లో చెలియా చెలియా సాంగ్ రీ క్రియేట్ చేయడం ఆడియన్స్ దృష్టిని ఎట్రాక్ట్ చేశాయి.