టాలీవుడ్ లో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో హీరోయిన్ గా సినిమా రంగంలో అడుగు పెట్టింది తాప్సీ. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది.  ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీ తాను డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె తన డైటీషియన్ కోసం నెలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొచ్చింది. తాప్సీ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 


తాప్సీ బాలీవుడ్ లో స్థిరపడటమే కాకుండా అక్కడ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన డైట్ గురించి చెప్పుకొచ్చింది. తాను ఉన్న ఈ వృత్తిలో ఎప్పుడు ఫిట్ గా ఉండడం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తానని తెలిపింది. ఒక్కో సినిమాకు ఒక్కోలా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుందని, అంతేకాకుండా శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదని మారిపోతూ ఉంటుందని చెప్పింది. అందుకే తాను తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుడానికి డైటీషియన్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తానని చెప్పింది. ప్రతీ నెలా ఎంత ఖర్చు అవుతుంది అని అడగగా.. తన డైటీషియన్ కోసం నెలకు లక్షకు పైగానే ఖర్చు చేస్తానని చెప్పింది తాప్సీ. ఈ విషయంలో ఎప్పుడూ తన తల్లిదండ్రలతో తిట్లు కూడా తింటానని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఖర్చులను తన తండ్రి అంగీకరించరని పేర్కొంది. 


తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఫాదర్స్ డే నాడు తన తండ్రికి పది రూపాయలు పెట్టి పెన్ ఒకటి గిప్ట్ గా ఇచ్చానని, అపుడు డబ్బులు వృథా చేసినందుకు తన తండ్రి కోపడ్డారని చిన్ననాటి విషయాన్ని గుర్తుచేసుకుంది. డబ్బులు ఖర్చు చేసే విషయంలో అమ్మ ఒప్పుకున్నా నాన్న మాత్రం ఇంకా మారలేదని, ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే దీనిపై చర్చ ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా తాను కెరీర్ కోసం పెడుతున్న పెట్టుబడి అని చెప్పింది. ప్రస్తుతం మనం బతుకున్న సమాజంలో ఏం తినాలో ఏం తినకూడదో తెలియదని అందుకే ప్రత్యేకంగా డైటీషియన్ కోసం అంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొంది. ఇది తన వృత్తి కోసం పెట్టే ఏకైక పెట్టుబడి అని తెలిపింది. 


తాప్సీ ఇటీవల కాలంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె చేసిని కొన్ని వ్యాఖ్యల వలన చిన్నపాటి వివాదలలో కూడా చిక్కకుంది. ఇక తాప్సీ కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువగానే చేస్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బీజీగా ఉంది. ఆమె షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘డుంకీ’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 22, 2023 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు రామ్ కుమార్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత తాప్సీ ‘హసీన్ దిల్రూబా 2’ లో నటించనుంది. ఈ మూవీలో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కూడా కనిపించనున్నారు.


Also Read : బుర్ర పాడు చేసే డిస్టర్బింగ్ ట్విస్ట్‌తో వచ్చిన లేటెస్ట్ మలయాళం మూవీ ‘ఇరట్టా’ - ఎలా ఉందంటే?