కరణ్ జోహార్ హోస్ట్ చేసే 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి అభిమానులు ఎంత మంది ఉన్నారో... విమర్శకులు సైతం అంతే మంది ఉన్నారు. షోలో కరణ్ ప్రశ్నలు, సెలబ్రిటీల సమాధానాలు ఎంజాయ్ చేసే వారు కొంత మంది అయితే... అవేం ప్రశ్నలు అంటూ విమర్శలు చేసేవారు మరి కొంత మంది! తాప్సీ పన్ను తాజా వ్యాఖ్యలు చూస్తే... ఆమెను కూడా విమర్శకుల జాబితాలో వేయవచ్చు. 


Taaspee Pannu Took A Dig At Koffee With Karan Chat Show : తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన 'దోబారా' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 'ఓ జర్నలిస్ట్ 'కాఫీ విత్ కరణ్' చాట్ షోలో మీరు కనిపించలేదేంటి?' అని తాప్సీ పన్నుని అడిగారు. అప్పుడు ఆమె ''కాఫీ విత్ కరణ్'కు ఆహ్వానించేంత ఆసక్తికరంగా నా శృంగార జీవితం లేదు ఏమో!?'' అని సమాధానం ఇచ్చారు.


విజయ్ సెక్స్ టాక్ హాట్ టాపిక్!
'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో ఇప్పటి వరకూ స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్స్ చూస్తే... విజయ్ దేవరకొండ కారులో, బోటులో శృంగారం చేశానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఎపిసోడ్‌లో ఆదిత్య రాయ్ కపూర్‌తో 'లైగర్' హీరోయిన్ అనన్యా పాండే డైటింగ్‌లో ఉన్న విషయాన్నీ కరణ్ బయట పెట్టారు. 


కరణ్‌తో ఆడుకున్న ఆమిర్
సెలబ్రిటీలను తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేయాలని ప్రయత్నించే కరణ్ జోహార్‌ను... బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఒక ఆట ఆదుకున్నారు. కరీనా కపూర్ ఖాన్‌ను 'పిల్లలు పుట్టిన తర్వాత క్వాలిటీ సెక్స్ సాధ్యమేనా?' అని కరణ్ అడిగారు. ఆవిడ కరణ్‌ను ఎదురు ప్రశ్నిస్తే... 'మా అమ్మ చూస్తుంది' అని అన్నారు. అప్పుడు ఆమిర్ ఖాన్ లైనులోకి వచ్చి'ఇతరుల శృంగార జీవితం గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనరా?' అని ఆదుకున్నారు. 


Also Read : 'ఎఫ్ 3' బాటలో 'బింబిసార' - నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడంటే?


కరణ్ జోహార్ సెక్స్ లైఫ్ గురించి తప్ప వేరే అంశాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదని నెటిజన్లు కొంత మంది విమర్శిస్తున్నారు. గత సీజన్లలో కరణ్ జోహార్ మీద ఇండస్ట్రీలో వారసులను ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపించేవి.బంధుప్రీతి (నేపోటిజం) చూపిస్తున్నారని అనేవారు. ఇప్పుడూ ఆ విమర్శలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే... కొత్తగా సెక్స్ టాపిక్స్ వచ్చాయి. సెక్సువల్ లైఫ్ టాపిక్స్ లేకుండా కరణ్ షో కంప్లీట్ కావడం లేదనే విమర్శ బలంగా వినబడుతోంది. విమర్శలను సైతం తన షోలో అప్పుడప్పుడూ కరణ్ ప్రస్తావిస్తున్నారు. తాప్సీ పన్ను విమర్శల గురించి కూడా ప్రస్తావించినా ఆశ్చర్యపోనవసరం లేదు. 


తాప్సీ పన్ను ఎటువంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి. తెలుగు సినిమాలతో ప్రయాణం ప్రారంభించి హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెను షోకి ఆహ్వానించలేదనే అంశం కొందరు నొక్కి మరీ చెబుతున్నారు. అవుట్ సైడర్ కాబట్టి తాప్సీ పన్నును ఇన్వైట్ చేయలేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  



Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే