దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటనకు ప్రేక్షక లోకం ఫిదా అంటోంది. 'సీతా రామం' (Sita Ramam Telugu Movie) లో వాళ్ళిద్దరి అభినయం, కెమిస్ట్రీ అద్భుతం అని అంటోంది. రష్మికా మందన్నా (Rashmika Mandanna) పాత్రకు న్యాయం చేశారని చెబుతున్నారు. నటీనటుల అద్భుత అభినయానికి హను రాఘవపూడి దర్శకత్వం, విశాల్ చంద్రశేఖర్ బాణీలు తోడు కావడంతో వెండితెరపైకి ఓ అందమైన దృశ్య కావ్యం వచ్చింది. 


'సీతా రామం' చిత్రానికి పేరు అయితే వచ్చింది కానీ... తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన వసూళ్లు కనబడలేదు. క్లాసిక్ లవ్ స్టోరీ కావడంతో మాస్ ఆడియన్స్ కాస్త దూరంగా ఉన్నారనే మాటలు ట్రేడ్ వర్గాల నుంచి వినిపించాయి. హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి సినిమా పికప్ అయ్యిందా? లేదా? అమెరికాలో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే...   


Sita Ramam First Weekend Collections In Telugu States : 'సీతా రామం' చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ బాగా హెల్ప్ అయ్యింది. తొలి రోజు కంటే రెండో రోజు, ఆ తర్వాత సెలవు రోజైన ఆదివారం మంచి కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ బరిలో సినిమా స్టడీగా ఉందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం కోటిన్నర షేర్, శనివారం రూ. 2.08 కోట్ల షేర్, ఆదివారం రూ. 2.62 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా.
 
'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 2.54 కోట్లు 
ఉత్తరాంధ్ర : రూ. 85 లక్షలు
సీడెడ్ : రూ. 65 లక్షలు
నెల్లూరు :  రూ. 23 లక్షలు
గుంటూరు :  రూ. 47 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 50 లక్షలు
తూర్పు గోదావ‌రి : రూ. 56 లక్షలు
పశ్చిమ గోదావ‌రి : రూ. 40 లక్షలు


ఏపీ, తెలంగాణ... మొత్తం మీద మూడు రోజుల్లో 6.20 కోట్ల రూపాయల షేర్  రాబట్టింది. గ్రాస్ వసూళ్లు అయితే... 11.65 కోట్ల రూపాయలు. 


అమెరికాలో భారీ హిట్!
'సీతా రామం' చిత్రానికి ఎన్నారై ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికాలో! మూడు రోజుల్లో అక్కడ 2.80 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. కర్ణాకట ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపితే 60 లక్షలు, ఇతర భాషల్లో రూ. 1.55 కోట్లు కలెక్ట్ చేసింది. 


ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే... ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా 11.15 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ వసూళ్లు చూస్తే... రూ. 22.20 కోట్లు ఉన్నాయి. 


Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!


'సీతా రామం'తో పాటు విడుదలైన 'బింబిసార' సినిమాకు రూ. 18.10 కోట్ల షేర్ (రూ. 29.8 కోట్ల గ్రాస్) లభించింది. నందమూరి అభిమానులకు తోడు మాస్ ఆడియన్స్ ఆదరించడంతో వసూళ్ల పరంగా ఆ సినిమా 'సీతా రామం' కంటే ముందంజలో ఉంది. 


Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే