నందమూరి నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'బింబిసార' (Bimbisara Movie). భారీ వసూళ్లతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచుతోంది. నందమూరి అభిమానులతో పాటు సగటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నకు నేడు నిర్వహించిన సక్సెస్ మీట్‌లో 'దిల్' రాజు నుంచి ఆన్సర్ లభించింది.
 
Bimbisara OTT Release : 'బింబిసార' 50 రోజుల తర్వాతే ఓటీటీ వేదికలో విడుదల అవుతుందని 'దిల్' రాజు చెప్పారు. ఆగస్టు 5న థియేటర్లలో 'బింబిసార' విడుదల అయ్యింది. అప్పటి నుంచి 50 రోజులు లెక్క వేసుకుంటే... సెప్టెంబర్ 23, 2022న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది. 'బింబిసార' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ 'జీ 5' ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. సో... 'జీ 5'లో సెప్టెంబర్ నెలాఖరున కళ్యాణ్ రామ్ సినిమా సందడి చేయనుందన్నమాట.


'ఎఫ్ 3' బాటలో 'బింబిసార'
థియేటర్లలో విడుదల అయిన నాలుగు వారాలకు ఓటీటీ వేదికల్లోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు వెండితెరపై చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది లేదా పది వారాల తర్వాత ఓటీటీలలో విడుదల చేయాలని చర్చలు సాగిస్తున్నారు. మినిమమ్ 50 రోజులు గ్యాప్ ఉండాలని ఇండస్ట్రీలో డిస్కషన్లు జరుగుతున్నాయి. 'ఎఫ్ 3' సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజులకు ఓటీటీకి ఇచ్చారు 'దిల్' రాజు. 


ఇప్పుడు 'ఎఫ్ 3' బాటలో 'బింబిసార' కూడా అదే బాటలో వెళుతోంది. దీనిపై 'దిల్' రాజు మాట్లాడుతూ ''నేను 'ఎఫ్ 3' విడుదల అయినప్పుడు ఓటీటీలో ఆలస్యంగా విడుదల చేయాలని మేం ప్రయత్నం మొదలు పెట్టాం. షూటింగ్స్ ఆగిన తర్వాత మాకు అదొక మేజర్ ఎజెండా. 'బింబిసార' ఓటీటీ విడుదల గురించి నిర్మాత హరికృష్ణ గారిని అడిగితే 'నిర్మాతలుగా ఈ సినిమాను కూడా 50 రోజుల తర్వాతే వచ్చేలా చేద్దామని అనుకున్నాం కదా' అన్నారు. ఆయనకు థాంక్స్. ఈ సినిమా కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. 50 రోజులు మీరు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తూ ఉండాలి'' అని చెప్పారు.  


'బింబిసార'లో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశారు. బింబిసారుడిగా ఆయన నటన ఎక్కువ మందిని ఆకట్టుకుంది. ఆ పాత్రకు, దేవదత్తుడి పాత్రకు మధ్య... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు.


Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!


'బింబిసార'కు జోడీగా కేథరిన్ ట్రేసా (Catherine Tresa) కనిపించారు. మరో కథానాయిక సంయుక్తా మీనన్ (Samyuktha Menon), ఎస్సై వైజయంతి పాత్రలో నటించారు. వాళ్ళిద్దరి పాత్రల నిడివి తక్కువే. అయితే... రెండో భాగంలో వాళ్ళకు ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె చిత్రాన్ని నిర్మించారు. వశిష్ఠ దర్శకత్వం వహించారు.


Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే