కోలీవుడ్ స్టార్, పాన్ ఇండియా అంతటా రికగ్నైజేషన్ ఉన్న యాక్టర్ సూర్య (Suriya Sivakumar). ఆయన ఫ్యాన్స్ అందరూ 'కంగువ' (Kanguva Movie) విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. నవంబర్ 14న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో దర్శక నిర్మాతలు బిజీ బిజీగా ఉంటే... మరో వైపు కొత్త సినిమా పనుల్లో సూర్య బిజీగా ఉన్నారు. లేటెస్టుగా తన 45వ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...


ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య
Suriya 45 In RJ Balaji direction: తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా నటుడు ఆర్జే బాలాజీ తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు. ఆయనలో నటుడు మాత్రమే కాదు... ఓ దర్శకుడు కూడా ఉన్నాడు. నయనతార ప్రధాన పాత్రలో 'మూకుత్తి అమ్మన్' అని ఓ సినిమా చేశారు. ఆ తర్వాత హిందీ సినిమా 'బదాయి హో'ను తమిళంలో 'వీట్ల విశేషం'గా రీమేక్ చేశారు. అందులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు దర్శకుడిగా మూడో సినిమాను అనౌన్స్ చేశారు.


సూర్య 45వ చిత్రానికి (Suriya 45) దర్శకత్వం వహించే అవకాశం ఆర్జే బాలాజీకి వచ్చింది. 'జోకర్', 'అరువి', 'ధీరన్ అధిగారం ఒండ్రు' (తెలుగులో 'ఖాకి'), 'ఖైదీ', 'సుల్తాన్', 'ఒకే ఒక జీవితం' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మాతలు. భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఇది రూపొందుతోంది. 






సూర్య 45వ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ... ''ప్రస్తుతం ఆర్జే బాలాజీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కథపై ఆయన ఏడాది నుంచి వర్క్ చేస్తున్నారు. లొకేషన్స్ ఖరారు చేయడానికి అనేక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం రెక్కీ నిర్వహిస్తున్నారు'' అని తెలిపారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. ''ఈ చిత్రాన్ని 2024 నవంబర్ నెలలో సెట్స్‌ మీదకు తీసుకు వెళ్లి, 2025 వేసవి తర్వాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు నిర్మాతలు.


Also Read: ఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?



రెహమాన్ సంగీతంలో సూర్య 45
సూర్య 45వ చిత్రానికి ఆస్కార్ అకాడమీ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'సిల్లును ఒరు కాదల్', 'ఆయుధ ఎళుతు', '24' వంటి సూపర్ హిట్ క్లాసిక్ సినిమాలు రెహమాన్, సూర్య కలయికలో వచ్చాయి. ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి.


Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??