Surekhavani's Daughter Supriya And Comedian Yadammaraju In Suma CMPK Cooking Show: బుల్లితెర టాప్ యాంకర్ సుమ (Suma) హోస్ట్‌గా వస్తోన్న వంటల షో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' (CMPK). ఈ షో తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో అందమైన సెలిబ్రిటీలు తమ కుకింగ్ నైపుణ్యాన్ని చూపించడం సహా ఆటలు, సరదా సంభాషణలు, టాస్కులతో ఎంటర్‌టైన్ చేస్తారు. మార్చి 6న సాయంత్రం 7 గంటలకు ఈ షో ప్రారంభం కానుండగా ఫస్ట్ ఎపిసోడ్‌లో 4 జంటలు ఎంటర్‌టైన్ చేయనున్నాయి. ఇప్పటికే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫేమ్ జోడీ విష్ణు ప్రియా భీమనేని, పృథ్వీ శెట్టి జంటగా సందడి చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. మరో జంటగా ప్రముఖ నటి సురేఖావాణి కూతురు సుప్రీత, జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు ఎంటర్‌టైన్ చేయనున్నారు.

Continues below advertisement


'వింత కాంబో.. సరికొత్త కామెడీ'






ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను ఆహా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. 'ఈ పెయిర్‌తో కాంబినేషన్ కొంచెం వింతగా ఉంది కదా.. కామెడీ మాత్రం సరికొత్తగా ఉంటుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా.. సురేఖావాణి కూతురు సుప్రీత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం సహా ధైర్యంగా స్పందిస్తారు. తాజాగా ఆమె బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు. అటు, యాదమ్మరాజు ఈటీవీలో ప్రసారమైన 'పటాస్' కామెడీ షో ద్వారా గుర్తింపు పొందారు. ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది షోలో తన స్కిట్లతో బుల్లితెర ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. అలాగే, గువ్వ గోరింక, జార్జిరెడ్డి, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లోనూ నటించారు. సుమ కుకింగ్ షోలో వీరి కాంబో నిజంగానే ఎంటర్‌టైన్ చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సెలబ్రిటీలు ఏయే వంటలు చేస్తారు.?, వీరు చేసే అల్లరి తెలియాలంటే.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.


Also Read: 'ఈటీవీ విన్'కు రెండేళ్లు - ఎక్స్‌క్లూజివ్‌గా మెసేజెస్ చిత్రాలతో పాటు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్, ఎప్పుడో తెలుసా?


ఈ కుకింగ్ షో గత 3 సీజన్లలో ప్రముఖ యాంకర్స్, టీవీ నటులు, సెలిబ్రిటీలు పాల్గొని ఎంటర్‌టైన్ చేశారు. టాప్ యాంకర్ సుమ హోస్ట్‌గా 'CMPK' అంతకుమించిన రేంజ్‌ సీజన్ 4 ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ప్రముఖ నటీనటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వెరైటీ రుచులు, సర్‌ప్రైజ్‌లతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నారు. వీరు వినోదంతో పాటు సరికొత్త రుచులు మనకు పరిచయం చేయనున్నారు. సీజన్ 3ను నిహారిక కొణిదెల్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్‌ను మంచు లక్ష్మీప్రసన్న హోస్ట్ చేశారు. ఇవి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.


Also Read: ఆ ఊరిలో మర్డర్, మిస్సింగ్ కేసుల మిస్టరీ - ఆ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'సుళుల్: ది వర్టెక్స్' సీజన్ 2, తెలుగులోనూ వచ్చేస్తోంది!