Balakrishna Expecting Bharat Ratna Award To His Father NTR: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకులు, తన తండ్రి ఎన్టీఆర్‌కు (NTR) త్వరలోనే 'భారతరత్న' (Bharat Ratna) వస్తుందని ఆశిస్తున్నట్లు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన ఆయన.. తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలల వేసి నివాళులు అర్పించారు. కేంద్రం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన నిమ్మకూరు రావడంతో గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. 'పద్మభూషణ్ అవార్డు వచ్చిన అనంతరం మా బంధువులతో ఆనందం పంచుకునేందుకు మా ఊరు వచ్చాను. కేవలం తెలుగు వారే కాదు యావత్ దేశం ఎన్టీఆర్ సేవలను గుర్తించుకుంటుంది. ఆయన చేపట్టిన పథకాలు, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచంలోనే ఎవరూ తీసుకుని ఉండరు. త్వరలోనే కేంద్రం ఆయనకు భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నాం.' అని బాలయ్య పేర్కొన్నారు.

Continues below advertisement


ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. గతంలోనూ బాలకృష్ణ చాలా సందర్భాల్లో ఎన్టీఆర్‌కు కేంద్రం అత్యున్నత పురస్కారం ప్రకటించాలని మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఇటీవలే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ క్రమంలోనే మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అన్నారు. 'నాకు పద్మభూషణ్ అవార్డు కంటే నాన్నకు భారతరత్న అవార్డు రావాలనేదే కోట్లాదిమంది తెలుగు ప్రజల ఆకాంక్ష.' అని పేర్కొన్నారు. మరోవైపు.. బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్' మూవీ ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఆయన తర్వాత సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 'అఖండ పార్ట్ 1'కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఈ విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.


Also Read: 'ఈటీవీ విన్'కు రెండేళ్లు - ఎక్స్‌క్లూజివ్‌గా మెసేజెస్ చిత్రాలతో పాటు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్, ఎప్పుడో తెలుసా?