Latest Upcoming Movies Exclusively Streaming On ETV Win: ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఈటీవీ విన్' (ETV Win) రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ ఓటీటీ వేదికగా రాబోయే మూవీస్, సిరీస్‌లకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. యూత్ ఎంటర్‌టైనర్స్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, క్రైమ్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అన్నీ కలగలిపి మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. 'తెలుగు ఆడియన్స్‌కు వినోదాలు పంచడంలో ఈటీవీ విన్ కీలక పాత్ర పోషిస్తుంది. తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకుల్నీ అలరించడానికి సిద్ధంగా ఉంది.' అని టీమ్ తెలిపింది. ఈ ఏడాది 16కు పైగా ఒరిజినల్ మూవీస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రేక్షకులకు అందించనున్నామని పేర్కొంది. ప్రతి గురువారం ఓ కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది.






రాబోయే సినిమాలివే..


అనగనగా - టాలీవుడ్ హీరో సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'అనగనగా' (Anaganaga). ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్'లో (ETV Win) ఈ ఉగాదికి (మార్చి 30) స్ట్రీమింగ్ కానుంది. సన్నీకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 'ఈటీవి విన్'తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 


కానిస్టేబుల్ కనకం - వర్షబొల్లమ్మ లీడ్ రోల్‌లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు.


Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం - దుబాయ్‌లో యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూత.. ఆయన మృతిపై పొలిటికల్ వార్


#SSS - శివాజీ, లయ, రోహన్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ #SSS. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. అలాగే, ఆదిసాయికుమార్, మేఘా లేఖ లీడ్ రోల్స్‌లో యశ్వంత్ దర్శకత్వంలో వస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి రానుంది. అటు, తనికెళ్ల భరణి, నరేశ్, బాలాదిత్య కీలక పాత్రలు పోషించిన మట్టికథలు సైతం ఓటీటీలోకి రానుంది. 


AIR (ఆల్ ఇండియా ర్యాంకర్స్) వెబ్ సిరీస్ - హర్షరోషన్, భానుప్రతాప్, జయతీర్థ, హర్షచెముడు, సింధురెడ్డి కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను జోసెఫ్ క్లింటన్ రూపొందించారు. విద్యా వ్యవస్థ బ్యాక్ డ్రాప్‌గా సిరీస్ రూపొందింది.


వీటితో పాటే.. వైఫ్ పార్టనర్, లవ్ యూ నానమ్మ, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు నేరుగా ఓటీటీలోకి విడుదలవుతాయని తెలిపింది. అలాగే, 'ఎందరో మోసిన సుందర భావం', #DM, హే హరి రామకృష్ణ జగన్నాథ, లిటిల్ హార్ట్స్ మూవీస్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అటు, ది జంగిల్ బుక్, బాల బాహుబలి కార్టూన్ షోలు సమ్మర్‌లో చిన్నారులను ఎంటర్‌టైన్ చేయనున్నాయి.


Also Read: ఆ ఓటీటీలోకి శృంగార తార 'షకీలా' బయోపిక్ స్ట్రీమింగ్ - తెలుగులో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..?