Richa chadha's Shakeela Streaming On Amazon Prime Video: అలనాటి శృంగార తార షకీలా జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ 'షకీలా' (Shakeela). ఈ బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి రిచా చద్దా (Richa Chadha) లీడ్ రోల్‌లో నటించారు. 2020 డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ దాదాపు ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇంద్రజీత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రిచా చద్దాతో పాటు పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై, ఎస్తేర్ నోరాన్హా, శివరానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ప్రకాశ్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్.. హీందీలో 'షకీలా' చిత్రాన్ని నిర్మించి అన్నీ భాషల్లోకి అనువదించారు. హిందీ, తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం షకీలా హిందీ వెర్షన్ అమెజాన్‌తో పాటు షమోర్ ఓటీటీ, ఓటీటీ ప్లే యాప్‌లోనూ అందుబాటులో ఉంది.

విడుదలైన 2 రోజులకే పైరసీ వెర్షన్

అప్పట్లో 'షకీలా' మూవీ థియేటర్లలో విడుదలైన 2 రోజులకే పైరసీ బారిన పడింది. ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్ కావడంతో నిర్మాతలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. షకీలా జీవితం గురించి ప్రపంచానికి తెలియని నిజాలను చూపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రమోషన్లలో ప్రచారం చేయగా.. ఆమె శృంగార తారగా ఎలా మారాల్సి వచ్చిందన్నది ఎమోషనల్‌గా చూపించడంలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయాలని నెట్టింట డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.

Also Read: మా అక్కినేని కుటుంబానికి ఆయనొక స్తంభం... అభిమాని మృతిపై నాగార్జున ఎమోషనల్ పోస్ట్

కథేంటంటే..!

కుటుంబ బాధ్యతలతో ఇష్టం లేకపోయినా తల్ల బలవంతం మీద శృంగార సనిమాల్లో నటించేందుకు ఒప్పుకొంటుంది షకీలా. కొద్ది రోజుల్లోనే పాపులర్ పోర్న్ స్టార్‌గా అవతరిస్తుంది. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో సలీమ్.. షకీలా పేరు ప్రఖ్యాతలను తక్కువ చేసేందుకు కుట్రలు పన్నుతాడు. దీంతో షకీలా జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది.?, షకీలాపై సలీమ్ ఎందుకు పగ పెంచుకున్నాడు..?, అసలు షకీలా ఎందుకు ఈ రంగంలోకి వచ్చింది..? వంటి విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ సినిమాలో షకీలా బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ హీరోయిన్‌ రిచా చద్దా పలు సినిమాల్లో నటించి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, ఫుక్రే, మసాన్, షకీలా, మేడ్ ఇన్ హేవెన్ 2 చిత్రాల్లో నటించి మెప్పించారు. గతేడాది రిలీజైన 'గర్ల్స్ విల్ బీ గర్ల్స్' మూవీతో ప్రొడ్యూసర్‌గా మారారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ కావడమే కాకుండా అవార్డులు అందుకుంది.

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం - దుబాయ్‌లో యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూత.. ఆయన మృతిపై పొలిటికల్ వార్