నో డౌట్... సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అనిరుద్ రవిచందర్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తారు. సాంగ్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. మరి, ఆ పాటకు తగ్గట్టు ఓ అందాల భామ కూడా ఉండాలి కదా! అందుకే బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)ను దించారు దర్శకుడు లోకేష్ కానగరాజ్. ఆవిడ లుక్ ఈ రోజు విడుదల చేశారు.
మీరు ఊహించింది కరెక్టే... పూజా హెగ్డే లుక్ ఇదిగో!
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలీ' (Coolie Movie) సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఆ సంగతి ఈ రోజు అఫీషియల్‌గా చెప్పారు. అంతే కాదు... ఆవిడ లుక్ కూడా విడుదల చేశారు. ''మీరు అందరూ కరెక్టుగా ఊహించారు. 'కూలీ' సెట్స్ నుంచి పూజా హెగ్డే లుక్ ఇదిగో'' అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది.
పూజా హెగ్డేకు మూడో స్పెషల్ సాంగ్...
లోకేష్ సినిమాలో అయితే ఇదే ఫస్ట్ సాంగ్!
Pooja Hegde special song in Coolie: యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో దర్శకుడు లోకేష్ కానగరాజ్ పేరు తెచ్చుకున్నారు. 'కూలి'కి ముందు లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 'విక్రమ్'... దళపతి విజయ్ హీరోగా 'మాస్టర్', 'లియో'... అలాగే కార్తీ 'ఖైదీ' సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లేవు. రజనీకాంత్ కోసం ఫస్ట్ టైం తన సినిమాలో స్పెషల్ సాంగ్ పెట్టారు లోకేష్.
బుట్ట బొమ్మ పూజా హెగ్డే విషయానికి వస్తే... ఇంతకు ముందు రెండుసార్లు స్పెషల్ సాంగ్స్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో ఆవిడ చేసిన 'జిల్ జిల్ జిగేల్ రాణి' ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ అండ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 3'లో కూడా ఒక సాంగ్ చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ చేస్తున్నారు. రజనీతో కాబట్టి సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుందని చెప్పవచ్చు. 'జైలర్'లో తమన్నా చేసిన 'వా నువ్ కావాలయ్యా' పాటను బీట్ చేస్తుందో? లేదో? వెయిట్ అండ్ సి.
Rajinikanth's Coolie cast and crew: 'కూలీ'లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ హీరో ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.