యువ కథానాయకుడు సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్... ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. సుమారు పదేళ్ల క్రితం 'టైగర్' చేశారు. ఆ తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'డిస్కో రాజా' చేశారు వీఐ ఆనంద్. తనకు తొలి విజయం అందించిన సందీప్ కిషన్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'ఊరు పేరు భైరవకోన'. ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే... సినిమా మీద నమ్మకంతో రెండు రోజుల ముందు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో పెయిడ్ ప్రీమియర్లు వేశారు. మరి, ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ఒక్కసారి చూడండి. 


సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్
'ఊరు పేరు భైరవకోన' సినిమాలో హీరో సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లు చూసిన మెజారిటీ జనాలు హీరో యాక్టింగ్ గురించి ట్వీట్స్ చేశారు. ఎప్పటిలా సందీప్ కిషన్ మంచి పెర్ఫార్మన్స్ చేశారని పేర్కొంటున్నారు. కొన్ని సన్నివేశాల్లో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ ఏడిపించేశారని భావోద్వేగానికి గురయ్యాడు ఓ అభిమాని.


Also Read: మచ్చ లేని ప్రేమకు మరణం మనతోనే - ఒక్క మాటతో అంచనాలు పెంచిన శశివదనే, రిలీజ్ ఎప్పుడంటే?






ఫస్టాఫ్ సూపర్... ఎంటర్‌టైన్‌మెంట్ అదిరింది
'ఊరు పేరు భైరవకోన' ఫస్టాఫ్ చాలా బావుందని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ కాస్త భరించాలని చెప్పారు. సినిమాలో నవ్వించే మూమెంట్స్ ఉన్నాయని, ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్ అని మరొక నెటిజన్ పేర్కొన్నారు. వెన్నెల కిషోర్, హర్ష సినిమాకు ప్లస్ అయ్యారని అంటున్నారు.


Also Readఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!






సోషల్ మీడియాలో సినిమాకు 3 ప్లస్ రేటింగ్స్
'ఊరు పేరు భైరవకోన'కు సోషల్ మీడియాలో 3 ప్లస్ రేటింగ్స్ ఇచ్చిన నెటిజనులు కొందరు ఉన్నారు. అనిల్ సుంకర, హాస్య మూవీస్ రాజేష్ దండ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి గొప్పగా చెబుతున్నారు. ఫైనల్లీ హిట్టు కొట్టేశామని సందీప్ కిషన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Also Readరామం రాఘవం - తండ్రి మీద కుమారుడికి ఉన్న ప్రేమను చెప్పే కథ










'ఊరు పేరు భైరవకోన' సినిమాలో సందీప్ కిషన్ జోడీగా వర్ష బొల్లమ్మ నటించగా... ఓ కీలక పాత్రలో కావ్య థాపర్ కనిపించారు. 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, బ్రహ్మాజీ వంటి నటులు నవ్వించే బాధ్యత తీసుకున్నారు.