Sasivadane movie releasing worldwide in theatres on April 5th: 'పలాస 1978'తో యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమాల్లో 'శశివదనే' ఒకటి. ఇందులో కోమలి హీరోయిన్. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీమతి గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 5న 'శశివదనే' విడుదల
Rakshit Atluri New Movie: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'శశివదనే' విడుదల తేదీ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. 'మనసులో పుట్టే ప్రేమ మచ్చ లేనిదైతే... ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్ మీద పేర్కొన్న డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాకు ప్రాణం పెట్టేశామని నిర్మాత అహితేజ బెల్లంకొండ ట్వీట్ చేశారు.
Also Read: రామం రాఘవం - తండ్రి మీద కుమారుడికి ఉన్న ప్రేమను చెప్పే కథ
కోనసీమ, గోదావరి నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. కుటుంబ కథలు కొన్ని, ప్రేమ కథలు ఇంకొన్ని... కోనసీమ నేపథ్యంలో చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే, యాక్షన్ చిత్రాలూ ఉన్నాయి. 'శశివదనే' గోదావరి నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమే. అయితే... ''గోదావరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి యాక్షన్ అండ్ లవ్ డ్రామా ఇది'' అని నిర్మాత అహితేజ బెల్లంకొండ అంటున్నారు. కోనసీమలో 50 రోజుల పాటు షూటింగ్ చేశారు. రక్షిత్, కోమలి అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చేశారని తెలిపారు.
Also Read: ఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!
'శశివదనే' చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీత దర్శకుడు. 'డీజే పిల్ల...' అంటూ సాగే గీతంతో పాటు టైటిల్ సాంగ్ కూడా కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆ రెండు పాటలతో పాటు టీజర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుందని, ప్రచార చిత్రాలకు లభించిన స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని దర్శక నిర్మాతలు తెలిపారు.
'శశివదనే' సినిమాలో సంగీత దర్శకుడు - నటుడిగా మారిన రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ (ఆచంట) , ప్రవీణ్ యండమూరి, 'జబర్దస్త్' బాబీప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ : గ్యారీ బీహెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం : సాయికుమార్ దార, సాహిత్యం : కిట్టూ విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం : శరవణ వాసుదేవన్.