Hero Sundeep Kishan New Movie: యువ కథానాయకుడు సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌ది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'టైగర్' సినిమా వచ్చింది. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఊరు పేరు భైరవకోన'  (Ooru Peru Bhairavakona Movie) టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా (Sundeep Kishan Birthday Special) సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ (OPBK first look), స్పెషల్ మేకింగ్ వీడియో చేశారు.


'ఊరు పేరు భైరవకోన' ఫస్ట్ లుక్ చూస్తే... పాడుబడిన భవంతుల మధ్య నిలబడిన సందీప్ కిషన్, ఆయన చేతిలో ఒక కర్ర, వెనుక అగ్ని కీలలతో మండుతున్న చందమామ... ఆసక్తికరంగా ఉంది. మేకింగ్ వీడియోలోనూ మంటలు కనిపించాయి. ఒంటికి మంట అంటుకోవడంతో నీళ్ళలోకి ఒకరు దూకడం కనిపించింది. మరి, ఆ మంటల్లో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి మిస్టరీ. ''ఎవరికీ అంతుచిక్కని రహస్య ప్రపంచం భైరవకోనలోకి ప్రవేశించండి'' అని చిత్రబృందం పేర్కొంది. 


'ఏక్ మినీ కథ' ఫేమ్ కావ్యా థాపర్, వర్షా బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న 'భైరవకోన' సినిమాను రాజేష్ దండ, బాలాజీ గుప్తా నిర్మిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.   


Also Read: సిక్స్‌ప్యాక్‌తో వ‌చ్చిన సందీప్ కిష‌న్‌, 'మైఖేల్' గట్స్ & గన్స్ చూశారా?


సందీప్ కిషన్‌కు ఈ రోజు డబుల్ ధమాకా అని చెప్పాలి. 'ఊరు పేరు భైరవకొన' కంటే ముందు 'మైఖేల్' సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా సందీప్ కిషన్‌కు పలువురు సినిమా ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.


Also Read: 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? 'కెజియఫ్ 2 కొత్త రికార్డు - 400 నాటౌట్