'కెజియఫ్ 2' సినిమా విడుదలై నాలుగు వారాలు దాటింది. అయినా బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గలేదు. ఆ సినిమా వసూళ్ల వేట ఇంకా కొనసాగుతోంది. అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కొత్త సినిమాలు వస్తున్నాయి వెళుతున్నాయి. యశ్ సినిమాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. లేటెస్ట్ గా హిందీలో 'కెజియఫ్ 2' సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది.
హిందీ మార్కెట్ పరంగా చూస్తే... అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఇప్పుడు 'కెజియఫ్ 2'ది రెండో స్థానం. ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు 400 కోట్లు దాటాయి. హిందీలో నాలుగో శుక్రవారం 3.85 కోట్ల రూపాయల వసూళ్లతో 'కెజియఫ్ 2' టోటల్ హిందీ వెర్షన్ వసూళ్లు 401.80 కోట్లు అయ్యాయి. ఈ సినిమా కంటే ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన 'బాహుబలి 2' ఉంది.
Also Read: 'కెజియఫ్' యాక్టర్ మోహన్ జునేజా మృతి, శాండిల్‌వుడ్‌లో విషాదం
హిందీలో 'బాహుబలి 2' సినిమాకు 510.99 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మరో 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే... ఆ సినిమా రికార్డును బీట్ చేసే అవకాశం 'కెజియఫ్ 2' సొంతం అవుతుంది. అయితే, ఫైనల్ రన్ లో అంత కలెక్ట్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.