సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న తాజా సినిమాకు మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ ఏ పేరు పెడుతున్నారు? ఆ సినిమా టైటిల్ ఏంటి? అటు ఘట్టమనేని అభిమానులు, ఇటు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో దీనిపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే... తన ప్రతి సినిమాకు ఎవరూ ఊహించని టైటిల్ పెడుతూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు త్రివిక్రమ్!


రేసులో మూడు టైటిళ్లు...
కొత్తగా 'ఊరికి మొనగాడు'
SSMB28 Title : మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు 'అమరావతికి అటు ఇటు', 'గుంటూరు కారం' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని కొన్ని రోజులుగా వినబడుతోంది. ఇప్పుడు కొత్తగా 'ఊరికి మొనగాడు' టైటిల్ రేసులోకి వచ్చింది. మహేష్ తండ్రి కృష్ణ ఘట్టమనేని హీరోగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన సినిమా టైటిల్ ఇది. 


Mahesh Babu New Movie Title : 'అ' అక్షరంతో మొదలయ్యే పేర్లకు కొన్నాళ్లుగా త్రివిక్రమ్ ప్రాముఖ్యం ఇస్తూ వస్తున్నారు. అది ఆయన సెంటిమెంట్. మరి, ఈసారి ఆ సెంటిమెంట్ పక్కన పెడతారా? మహేష్ బాబు ఏ పేరుకు ఓటు వేస్తారు? ఈ మూడు పేర్లు కాకుండా కొత్త పేరు ఏదైనా ఫిక్స్ చేస్తారా? అనేది చూడాలి. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.


వచ్చే నెలలో కొత్త షెడ్యూల్!
మహేష్ బాబు విదేశాలకు విహారయాత్రకు వెళ్ళడానికి ముందు త్రివిక్రమ్ చాలా సన్నివేశాలు తెరకెక్కించారు. హీరోతో పాటు హీరోయిన్లు పాల్గొనగా... కీలక సీన్లు, ఫైట్స్ తీశారు. ఇప్పుడు జూన్ నెలలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.


Also Read పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!
 
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. 


Also Read : అన్నీ ఇచ్చేవాడిని దేవుడు కాదు, నాన్న అంటారు - ఈ బుడ్డోడిని మర్చిపోలేం!



మహేష్ సినిమాలో జగపతి బాబు!
'శ్రీమంతుడు', 'మహర్షి' సినిమాల తర్వాత మరోసారి మహేష్ బాబుతో జగపతి బాబు నటిస్తున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రమిది. 


SSMB28 సినిమాలో తన పాత్ర గురించి జగపతి బాబు మాట్లాడుతూ ''మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. 'అరవింద సమేత'లో త్రివిక్రమ్ నా కోసం అద్భుతమైన పాత్ర రాశారు. నా నుంచి అద్భుతమైన నటన రాబట్టుకున్నారు. ఈసారి మేం మరింత ఆసక్తికరంగా, ఇప్పటి వరకు ఎవరూ చేయనిది ఏదైనా చేయాలనుకున్నాం. మహేష్ సినిమాలో పాత్రను 'అరవింద సమేత...'లో చేసిన బసిరెడ్డి కంటే భయంకరమైన, వైల్డ్ గా చేశాం. అయినా సరే ప్రేక్షకులు ఆ పాత్రను ఇష్టపడతారు. అది మంచిగా కావచ్చు, చెడుగా అయినా కావచ్చు'' అని పేర్కొన్నారు. తన పాత్ర అందరినీ మెప్పించేలా ఉంటుందని చెప్పారు.