ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు & కథానాయకుడు రాఘ‌వ లారెన్స్‌ (Raghava Lawrence), దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి నటుడిగా మారిన ఎస్‌.జె. సూర్య (SJ Surya) ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందుతోన్న హై యాక్ష‌న్ డ్రామా 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌'. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 


దీపావళికి 'జిగర్ తండా డబుల్ ఎక్స్'
Jigarthanda Double X Release Date : తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో 'జిగర్ తండా డబుల్ ఎక్స్' సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కార్తీకేయ‌న్ నిర్మిస్తున్నారు. 



సీక్వెల్ కాదిది... ప్రీక్వెల్!
'జిగర్ తండా డబుల్ ఎక్స్' సినిమా రెగ్యులర్ షూటింగ్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌ నెలలో స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ చేస్తున్నారు. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా 'జిగ‌ర్ తండా'కి ప్రీక్వెల్‌ ఇది. ఆ సినిమాను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, తమిళ నటుడు అధర్వ మురళి ప్రధాన పాత్రలో 'గద్దలకొండ గణేష్' పేరుతో హరీష్ శంకర్ రీమేక్ చేశారు.


కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన దర్శకుడిగా పరిచయమైన 'పిజ్జా' తెలుగులోనూ సెన్సేషనల్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ తీసిన 'పేట' ఆశించిన విజయం సాధించలేదు. కానీ, కొన్ని సన్నివేశాలు అభిమానులను అలరించాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు.  


ఇదీ బ్లాక్ బస్టర్ అవుతుంది! - కార్తీక్ సుబ్బరాజ్
'జిగర్ తండా డబుల్ ఎక్స్' సినిమా విడుదల విషయం వెల్లడించిన సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ ''ఈ ఏడాది దీపావ‌ళికి 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌' విడుద‌ల చేయ‌నుండ‌టం చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను ద‌ర్శ‌క‌త్వం వహించిన 'జిగ‌ర్ తండా'కు ఇది ప్రీక్వెల్‌. ఆ సినిమా ఘన విజయం సాధించిన‌ట్లే 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌' కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను'' అని అన్నారు.


Also Read : పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!






ఇది మాస్ ఎంటర్టైనర్ - కార్తికేయ‌న్ సంతానం
స్టోన్ బెంచ్ ఫిలింస్ అధినేత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ ''మేం ఈ 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌' అనౌన్స్ చేసిన రోజు నుంచి ప్రేక్షకులు అంద‌రిలోనూ ఓ తెలియ‌ని ఎగ్జ‌యిట్‌మెంట్ క్రియేట్ అయ్యింది. 'జిగ‌ర్ తండా'ను ప్రేక్ష‌కులు ఎంత‌ ఎలా ఆద‌రించారో.... అలాగే ఇప్పుడీ 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌' చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. ఆదరిస్తారనే న‌మ్మ‌కం మాకు ఉంది. ఇది మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుదల చేయ‌బోతున్నాం'' అని అన్నారు.


Also Read : వెంకీతో దుల్కర్ సల్మాన్ - అక్టోబర్‌లో సెట్స్‌కు, సమ్మర్‌లో థియేటర్లకు!