'ఆర్ఆర్ఆర్'కి థియేటర్లలో బ్రహ్మాండమైన స్పందన లభించింది. తెలుగులోనే కాదు... తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ వసూళ్లు సాధించింది. ఇండియాతో పాటు విదేశాల్లోనూ మంచి వసూళ్లు వచ్చాయి. భారతీయ చలన చిత్ర ప్రముఖులు 'ఆర్ఆర్ఆర్'ను థియేటర్లలో చూశారు. అయితే, ఓటీటీలో విడుదలైన తర్వాత హాలీవుడ్ సినిమా ప్రముఖులు 'ఆర్ఆర్ఆర్' చూడటం మొదలు పెట్టారు. ఒక్కొక్కరుగా సినిమాను ప్రశంసిస్తున్నారు.


Spider-Verse writer, producer Christopher Miller about RRR Movie: 'ఆర్ఆర్ఆర్' నచ్చిన హాలీవుడ్ సెలబ్రిటీల జాబితాలో  లేటెస్టుగా 'స్పైడ‌ర్‌మ్యాన్ వర్స్' రైటర్, ప్రొడ్యూసర్ క్రిస్టోఫర్ మిల్లర్ కూడా చేరారు. ''అద్భుతంగా ఉంది. 'ఆర్ఆర్ఆర్' ఓవర్ ద టాప్ సినిమా. మైఖేల్ బే (ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌ సిరీస్ దర్శకుడు), బజ్ లుర్‌మ‌న్‌ (ఆస్ట్రేలియా, ద గ్రేట్ గట్స్ బి చిత్రాల దర్శకుడు), స్టీఫెన్ చౌ (షావలిన్ సాకర్ దర్శకుడు) కలిసి సినిమా తీసినట్టు ఉంది. సినిమా మూడు గంటలు ఉంది. నాలుగు గంటలు ఉన్నా ఎంజాయ్ చేసేవాడిని'' అని క్రిస్టోఫర్ మిల్లర్ ట్వీట్ చేశారు. 


Also Read: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'


''22 జంప్ స్ట్రీట్', 'ద లెగో మూవీ' చిత్రాలకు క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించారు. 'స్పైడర్ మ్యాన్: స్పైడర్ వర్స్' సిరీస్ రచయిత, నిర్మాతల్లో ఆయన ఒకరు. 'కెప్టెన్ అమెరికా', 'బ్యాట్ మ్యాన్' సినిమాల రైటర్ జాక్సన్ కూడా 'ఆర్ఆర్ఆర్' గురించి ట్వీట్ చేశారు. ఇటీవల 'డాక్టర్ స్ట్రేంజ్' రైటర్ సి రాబర్ట్ గిల్ ''క్రేజీయెస్ట్ బ్లాక్ బస్టర్' అంటూ 'ఆర్ఆర్ఆర్' గురించి ట్వీట్ చేశారు.


Also Read: నైటీ వేసిన నాటీ ఫెలో, 'హ్యాపీ బర్త్‌ డే'లో వెన్నెల కిశోర్ అలా!


నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' విడుదలైన తర్వాత ఫారిన్ కంట్రీస్‌లో చాలా మంది సినిమా చూస్తున్నారు. ఫారిన్ ప్రేక్షకులను 'ఆర్ఆర్ఆర్' ఆకట్టుకుంటోంది.


Also Read: 'ఎవరి దగ్గరకు వెళ్ళనూ? మసి చేస్తారు' - చాందిని చౌదరి & ఫ్యామిలీని భయపెట్టిన ప్రొడ్యూసర్