రోజుల్లో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్లు, మేకర్స్ అంతా కలిసి పనిచేస్తున్నారు. వాటికే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అని పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఆ లిస్ట్‌లోకి మరో సినిమా చేరనుంది. ఊహించని కాంబినేషన్ ఒకటి ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అవుతోంది. అదే ఫహాద్ ఫాజిల్, రాజమౌళి కాంబినేషన్. తన యాక్టింగ్‌తో మాలీవుడ్‌ను మాత్రమే కాదు.. మొత్తం సౌత్ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు ఫాహద్. ఇక తన డైరెక్షన్‌తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్నారు  రాజమౌళి. వీరిద్దరి కాంబో అంటే ఆడియన్స్‌లో ఒక రేంజ్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.


ఒకే కాంబినేషన్‌లో రెండు సినిమాలు..


ఫాహద్ ఫాజిల్.. ఒక సినిమాకు, మరొక సినిమాకు ఎక్కువగా గ్యాప్ తీసుకోరు. ఒకట్రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే తనకు నచ్చిన స్క్రిప్ట్స్‌ను ఓకే చేస్తుంటారు. అలాగే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో రెండు కొత్త చిత్రాల అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశారు ఫాహద్. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలను రాజమౌళినే ప్రజెంట్ చేస్తున్నారు. అలా మొదటిసారి ఫాహద్, రాజమౌళి చేతులు కలపనున్నారు. ముందుగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆక్సిజన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అందులో ఫాహద్ ఫాజిల్ మాస్క్ పెట్టుకొని కనిపించారు. అంతే కాకుండా తన మొహంపై ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. ‘ఆక్సిజన్’ ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్.


అద్భుతమైన టీమ్..


ఫాహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న‘ఆక్సిజన్’ను సిద్ధార్థ నాదెళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. రాజమౌళి క్లోజ్ ఫ్రెండ్ అయిన శోభు యార్లగడ్డ తన ప్రొడక్షన్ హౌజ్.. ఆర్కా మీడియా వర్క్స్ ద్వారా ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. శోభు యార్లగడ్డతో పాటు రాజమౌళి తనయుడు కార్తికేయ.. షోయింగ్ బిజినెస్ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ఈ మూవీని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇక రాజమౌళి కూడా ‘ఆక్సిజన్’ను ప్రజెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా అద్భుతమైన టీమ్ అంతా ‘ఆక్సిజన్’ కోసం చేతులు కలిపారు. ‘పరివర్తన, స్నేహంకు సంబంధించిన కథ. నిజమైన ఘటనల ఆధారంగా తెరకెక్కనుంది’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్.. తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.






నాలుగు భాషల్లో..


‘ఆక్సిజన్’ మూవీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. 2024లోనే షూటింగ్ మొదలవుతుందని కూడా మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఫస్ట్ లుక్‌ను బట్టి చూస్తే.. ఇది కోవిడ్ సమయంలో జరిగిన కథ అయ్యిండొచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక ఫాహద్ ఫాజిల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’లో విలన్ రోల్‌లో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దాంతో పాటు రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘వెట్టయాన్’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.


Also Read: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్