Sreeleela Glimpse From Robinhood Out Now: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న శ్రీలీల పుట్టనరోజు నేడు (జూన్ 14). గతేడాది ఈ టైమ్‌కు శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అందుకే ఈరోజుంతా తన అప్‌కమింగ్ మూవీస్‌కు సంబంధించిన అప్డేట్స్ విడుదల అవుతూ ఉన్నాయి. ఈ ఏడాది శ్రీలీల కాస్త స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం తన చేతిలో రెండు మూవీస్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒక సినిమా నుండి శ్రీలీల ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తన లుక్ రొటీన్‌గానే ఉన్నా.. పేరు మాత్రం డిఫరెంట్‌గా ఉంది. ఇంతకీ అది ఏ సినిమా అప్డేటో మీరే చూసేయండి.


క్యారెక్టర్ గ్లింప్స్..


ఇప్పటికే నితిన్, శ్రీలీల కలిసి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీలో జంటగా నటించారు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్‌ను సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ కోసం వీరిద్దరూ చేతులు కలిపారు. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఈ మూవీ నుండి తన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘తన లుక్స్ చూస్తే తనకోసం చచ్చిపోవాలి అనిపిస్తుంది. తన యాటిట్యూడ్ చూస్తే తననే చంపేయాలి అనిపిస్తుంది’ అంటూ శ్రీలీల క్యారెక్టర్ గురించి చెప్తూ.. ‘రాబిన్‌హుడ్’లో తన పేరు నీరా వసుదేవన్ అని రివీల్ చేశారు మేకర్స్.


బాగా రిచ్..


శ్రీలీల క్యారెక్టర్ గ్లింప్స్‌లోనే ‘రాబిన్‌హుడ్’ మూవీలో తను చాలా రిచ్ అని క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్. ఇక ఈ గ్లింప్స్‌లో తనకు ఒక డైలాగ్ కూడా ఉంది. ‘సునామీలో టీ సైలెంట్ ఉండాలి. నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి’ అంటూ వెన్నెల కిషోర్‌ను ఆర్డర్ చేస్తుంది శ్రీలీల. ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్.. శ్రీలీల అసిస్టెంట్ పాత్రలో కనిపించనున్నాడని, తన పాత్ర పేరు జ్యోతి అని కూడా ఈ గ్లింప్స్‌లోనే రివీల్ అయ్యింది. నితిన్, వెంకీ కుడుముల, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ మూవీ డిసెంబర్ 20న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.






రష్మిక స్థానంలో..


ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘భీష్మ’ మూవీ వచ్చింది. చాలాకాలంగా ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్‌కు క్లీన్ హిట్‌ను అందించింది ‘భీష్మ’. ఇప్పుడు మరోసారి అదే హిట్ కాంబో రిపీట్ కానుంది. ముందుగా నితిన్, వెంకీ కలిసి సినిమా చేస్తున్నారు అని ప్రకటిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు మేకర్స్. కానీ అందులో హీరోయిన్‌గా రష్మిక మందనా నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ కూడా చేసేశారు. మరోసారి డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాంబో రిపీట్ కానుందని తెలిపారు. కానీ పలు కారణాల వల్ల రష్మిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకొని ఆ స్థానంలోకి శ్రీలీల వచ్చింది.


Also Read: ‘స్వాగ్’ నుంచి రేజర్ క్యారెక్టర్ రివీల్ - ముసలివాడి గెటప్‌లో షాకిచ్చిన శ్రీవిష్ణు, కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే!