Razor Teaser From Swag Is Out Now: ఈరోజుల్లో సినిమా ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే మూవీ తరువాతి అప్డేట్స్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. అలాంటి క్రియేటివ్ ఐడియాలతో అప్డేట్స్‌ను అందిస్తున్న సినిమాల్లో ‘స్వాగ్’ ముందుంటుంది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చినప్పటి నుంచి ఆడియన్స్‌లో ఆసక్తి మొదలయ్యింది. ఆ తర్వాత హీరోయిన్‌గా రీతూ వర్మ ఇంట్రడక్షన్ కూడా అందరికీ నచ్చింది. ఇప్పుడు ‘మగవాడి మోత మొదలవ్వబోతుంది’ అంటూ ‘స్వాగ్’ నుంచి శ్రీవిష్ణు క్యారెక్టర్ గ్లింప్స్ విడుదలయ్యింది. అదే ‘రేజర్’. ఇందులో శ్రీ విష్ణును చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.


ఎస్సై భవభూతి..


ఇప్పటికే ‘స్వాగ్’ నుంచి శ్రీ విష్ణు క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యింది. కానీ తాజాగా విడుదలయిన ‘రేజర్’ మాత్రం అలా కాదు. ఇందులో శ్రీ విష్ణు ముసలివాడిలాగా కనిపిస్తూ ఆశ్చర్యపరిచాడు. ‘మగవాడంటే మీకేం గుర్తొస్తుంది’ అంటూ ముసలివాడి క్యారెక్టర్‌లో ఉన్న శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘రేజర్’ టీజర్ మొదలవుతుంది. ‘వేలెడంత పొగరు, వంశాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు’ అని చెప్పగానే ఒక విచిత్రమైన నవ్వుతో శ్రీ విష్ణు ఫేస్ రివీల్ అవుతుంది. ‘తాగుదామా ఇంకా’ అనే డైలాగ్‌తో శ్రీ విష్ణు స్వాగ్‌ను చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. ‘దివాకార్‌పేట ఎస్సై భవభూతి ఇక్కడ’ అంటూ తనను క్యారెక్టర్ గురించి తాను పరిచయం చేసుకున్నాడు.


రెండు గెటప్స్..


‘ఆడవాళ్లను, ఆడ దేవుళ్లను ఏం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మగ దేవుళ్లనే అనుసరించాలి. వంశాలైనా, ఆస్తులైనా, ఆడవాళ్లైనా’ అనే డైలాగ్‌ భవభూతికి ఎంత అహం ఉందో ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుంది. ఇక ఈ ‘రేజర్’ టీజర్‌ను బట్టి చూస్తే ‘స్వాగ్’ కథ గురించి కొంతవరకు క్లారిటీ వస్తుంది. ఇందులో శ్రీ విష్ణు రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. అందులో యంగ్ శ్రీ విష్ణు క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్‌లో ఉంటుందని, తనకు జోడీగా రీతూ వర్మ నటిస్తుందని ప్రేక్షకులు అప్పుడే అంచనా వేసేస్తున్నారు. మొత్తానికి ‘స్వాగ్’ నుంచి విడుదలయ్యే ప్రతీ అప్డేట్.. కథను పూర్తిగా రివీల్ చేయకుండా అందరిలో ఆసక్తిని పెంచేస్తోంది.






క్లారిటీ లేదు..


హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు ఇప్పటికే ‘రాజ రాజ చోర’ మూవీలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్వాగ్’పై ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీతూ వర్మ, మీరా జాస్మిన్‌తో పాటు దక్ష కూడా ‘స్వాగ్’లో మరో కీ రోల్‌లో కనిపించనుంది. ఇదొక అచ్చ తెలుగు సినిమా అని చెప్పడం తప్పా అసలు దీని జోనర్ ఏంటి అని ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. ఇప్పటివరకు ఎన్ని గ్లింప్స్‌ను విడుదలయిన అసలు ఈ సినిమా జోనర్ ఏమయ్యిండొచ్చు అని ప్రేక్షకులు ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ‘స్వాగ్’ను నిర్మించారు.


Also Read: 'హరోం హర' రివ్యూ: కుప్పంలో కేజీఎఫ్ రేంజ్ కథ - సుధీర్ బాబుకు విక్రమ్ రేంజ్ ఎలివేషన్స్!