Nithiin Robinhood movie Special look : నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమా  'రాబిన్ హుడ్'. హీరో నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'రాబిన్ హుడ్' టీమ్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. నితిన్ కి బ‌ర్త్ డే విషెస్ చెప్తూ స్పెష‌ల్ పోస్ట్  చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌న ఇన్ స్టా ద్వారా ఈ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. 'ఏజెంట్ రాబిన్ హుడ్ రిపోర్ట్స్ ఆన్ డ్యూటీ ఫ‌ర్ అడ్వంచ‌ర్స్' అంటూ రాసుకొచ్చింది ఆ పోస్ట్ లో. దాంట్లో నితిన్ ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించారు. గ‌న్స్ తో, ఫోన్ లో మాట్లాడుకుంటూ న‌డుస్తున్న‌ట్లుగా ఉంది ఆ ఫొటో. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. 






భీష్మ త‌ర్వాత సేమ్ కాంబినేష‌న్... 


'భీష్మ' విజయం తర్వాత మ‌రోసారి వెంకీ కుడుముల, నితిన్ క‌లిసి చేస్తున్న చిత్రం 'రాబిన్ హుడ్'. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు మేక‌ర్స్. అప్పుడే వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. నితిన్ క్యారెక్టర్ మరింత రివీల్ చేయడంతో పాటు ఆయనతో చెప్పించిన డైలాగులు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా యాక్ష‌న్ సీక్వెన్స్ లో రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. నితిన్ లుక్ అయితే అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్.


డబ్బు చాలా చెడ్డది... దోచుకున్న నితిన్!


'రాబిన్ హుడ్' ఫ‌స్ట్ గ్లింప్స్ ఇప్ప‌టికే జ‌నాన్ని తెగ ఆక‌ట్టుకుంది. దాంట్లో నితిన్ కాన్ మ్యాన్ (మోసగాడు) రోల్ చేస్తున్నారని చిత్ర బృందం వెల్లడించింది. ఆ త‌ర్వాత క్యారెక్టర్ గురించి మరింత డిటైల్డ్‌గా వీడియో గ్లింప్స్‌లో వివరించారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టు డబ్బునోళ్ల దగ్గర దోచుకునే యువకుడిగా నితిన్ పాత్రను చూపించారు. 'రాబిన్ హుడ్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే... ఇంకా ఈ సినిమాలో కథానాయిక పేరును చెప్పలేదు. తొలుత రష్మికను ఎంపిక చేసినా... డేట్స్ అడ్జస్ట్ కాక ఆమె వెళ్లిపోయారు. రష్మిక బదులు శ్రీ లీలను ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 


తమ్ముడితో మ‌రో స‌ర్ ప్రైజ్.. 


పుట్టిన రోజు సందర్భంగా హీరో నితిన్ అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. పవర్ స్టార్ సినిమా పేరుతో కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసి స‌ర్ ప్రైజ్ చేశారు. త‌మ్ముడు పేరుతో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పేరు చూసి నితిన్ అభిమానులతో పాటు పవన్ అభిమానులు తెగ సంబ‌ర ప‌డిపోతున్నారు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ‘తమ్ముడు‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆడవాళ్లు లారీని నడుపుతూ కనిపించారు. లారీ మీద కుమార స్వామి ఆయుధాన్ని పట్టుకుని నితిన్ కూర్చున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్ర‌తి ఒక్క‌రు పోస్ట‌ర్ సూప‌ర్ ఉండంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక నితిన్ కి బ‌ర్త్ డే విషెస్ చెప్తున్నారు. 


Also Read: పవర్ స్టార్ మూవీ పేరుతో నితిన్ కొత్త మూవీ, ‘తమ్ముడు‘ ఫస్ట్ లుక్ అదుర్స్