Vijay Devarakonda About His Romantic Relationship: విజ‌య దేవ‌ర‌కొండ‌.. ప్ర‌స్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా ప్ర‌మోష‌న్స్ లో బీజీగా ఉన్నాడు ఈ రౌడీ బాయ్. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో వివిధ ఛానళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు దేవ‌ర‌కొండ‌. ఆయ‌న్ని ఇంట‌ర్వ్యూ చేయ‌డం అంటే.. ఈ మ‌ధ్య కాలంలో ఒక కామ‌న్ ప్ర‌శ్న ఉంటుంది. అదే ర‌ష్మికతో రిలేషిన్ లో ఉన్నారా? అనే ప్ర‌శ్న‌. కార‌ణం.. ఎన్నో రోజుల నుంచి  ఈ విష‌యానికి సంబంధించి వార్త‌లు బ‌య‌టికి రావ‌డం. అయితే, అటు ర‌ష్మిక‌, ఇటు విజ‌య్ ఎవ్వ‌రూ వాటిపై స్పందించ‌డం లేదు. ఇప్పుడు దానిపై స్పందించారు దేవ‌ర‌కొండ‌. ఒక ఆస‌క్తిక‌ర ఆన్స‌ర్ చెప్పారు. "ఎస్ నేను రిలేష‌న్ లో ఉన్నాను. కానీ, ఎవ‌రితో అంటే" అంటూ త‌న స‌మాధానం చెప్పుకొచ్చారు విజ‌య్. 


ఎస్ నేను రిలేష‌న్ లో ఉన్నాను.. 


ఫ్యామిలీ స్టార్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు విజ‌య‌ దేవ‌ర‌కొండ‌. గ‌లాటా ప్ల‌స్ అనే ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హోస్ట్ ఆయ‌న్ని ఇలా అడిగింది. విజ‌య దేవ‌ర‌కొండ రిలేష‌న్ షిప్ లో ఉన్నారా? అని అడిగగానే విజ‌య్ వెంట‌నే స‌మాధానం చెప్పారు. "ఎస్ నేను రిలేష‌న్ షిప్ లో ఉన్నాను. మా అమ్మ, నాన్న‌, త‌మ్ముడితో ఉన్నాను. మీతో కూడా ఉన్నాను. మ‌నంద‌రి మ‌ధ్య ఏదో ఒక రిలేష‌న్ షిప్ ఉంటుంది క‌దా?" అంటూ తెలివిగా స‌మాధానం చెప్పి త‌ప్పించుకున్నారు విజ‌య్. దీంతో ఇప్పుడు ఈ ఇంట‌ర్వ్యూ వైర‌ల్ అవుతోంది. దీనిపై దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. "భ‌లే చెప్పావు స‌మాధానం అంటుంటే.. ఎందుక‌న్నా దాస్తావు చెప్పేసేయ్ అంటున్నారు". 


విజ‌య దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఇద్ద‌రూ 'డియ‌ర్ కామ్రేడ్', 'గీత గోవిందం' సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఆ సినిమాలు రెండు సూప‌ర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇక వాళ్ల జంట‌కి ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ఇద్ద‌రు రిలేష‌న్ లో  ఉన్నార‌నే టాక్ గ‌ట్టిగా బ‌య‌టికి వ‌చ్చింది. అది కాకుండా ఇద్ద‌రూ ఒకే లొకేష‌న్ లో ఉన్న ఫొటోలు ఒకేసారి పోస్ట్ చేయ‌డం, అవి వైర‌ల్ అవ్వ‌డం లాంటివి గ‌తంలో చాలానే జ‌రిగాయి. అయితే, ఆ రూమ‌ర్స్ పై ఇద్ద‌రు ఎప్పుడూ స్పందించ‌లేదు. రిలేష‌న్ లో ఉన్నామ‌ని ఒప్పుకోలేదు, అలా అని ఆ రూమ‌ర్స్ ని ఖండించ‌లేదు. దీంతో ప్ర‌తి ఒక్క‌రికి ఇప్పుడు వాళ్ల మ‌ధ్య రిలేష‌న్ ఉందా? లేదా? అనేది డౌట్. 


బిజీ బిజీగా ఇద్ద‌రు.. 


ఇక సినిమా విష‌యానికొస్తే.. ఇద్ద‌రు బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. విజ‌య దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన టీజ‌ర్, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక పాట‌లు కూడా అంద‌రినీ అల‌రిస్తున్నాయి. ఇక ర‌ష్మిక 'యానిమల్' సినిమా స‌క్సెస్ త‌ర్వాత మ‌రో ప్రాజెక్ట్ లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. అయితే, 'పుష్ప - 2' షూటింగ్ లో ఆమె బిజీగా ఉంటున్నార‌ని, ఆమె లుక్ ను స‌స్పెన్స్ లో ఉంచుతున్నార‌నే వార్త‌లు ఫిలిమ్ న‌గ‌ర్ లో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.


Also Read: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ