Next BTS: సౌత్ కొరియన్ మ్యూజిక్‌ను, అక్కడ కల్చర్‌ను ప్రపంచ నలుమూలలా తెలిసేలా చేసింది 'BTS'. 'BTS' బ్యాండ్ కారణంగానే కొరియన్ మ్యూజిక్‌కు ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. బీటీఎస్‌ను ఇష్టపడేవారంతా తాము బీటీఎస్ ఆర్మీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక 'BTS' తర్వాత ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది ‘పారసైట్’. ఇప్పుడు ఆ రెండు బ్యాండ్స్ కూడా పలు కారణాల వల్ల ప్రేక్షకులకు దూరమయ్యాయి. దీంతో సౌత్ కొరియన్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. 5 ట్రిలియన్ ఆర్థిక సాయంతో కొత్త 'BTS', ‘ప్యారసైట్’ బ్యాండ్స్‌ను ప్రారంభించాలనుకుంటోంది.


ప్రభుత్వం నిర్ణయం..


జిన్, సుగ, జిమిన్, ఆర్ఎమ్, వి, జే హోప్, జంగ్‌ కూక్.. ఈ ఏడుగురు కలిసి ప్రారంభించిన 'BTS' వరల్డ్‌వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఆ 'BTS' లేదు. వారంతా ప్రస్తుతం సైన్యంలో చేరి దేశ సేవలో నిమగ్నమయ్యారు. తాజాగా జిన్ తన ఆర్మీ విధులను పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. మిగిలిన అందరూ వచ్చి.. 2025లో కాన్సెర్ట్ చేస్తారని భావిస్తున్నారు. ఈలోపే అక్కడి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ‘న్యూ BTS' అనే పేరుతో మరో కొత్త ఏడుగురు సింగర్స్‌ను తీసుకొచ్చి ఒక బ్యాండ్‌ను రెడీ చేయాలనుకుంటోంది సౌత్ కొరియా ప్రభుత్వం. అప్పటి 'BTS' కారణంగా సౌత్ కొరియా కల్చర్, టూరిజం అనేవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడే బ్యాండ్ కూడా వాటిని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ విషయాన్ని వైస్ మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్, టూరిజం అయిన జియోన్ బ్యోంగ్ గ్యూక్ స్వయంగా ప్రకటించారు.



కొత్తవాళ్లకు ప్రోత్సాహం..


కొత్త 'BTS'ను ఏర్పాటు చేయడం కోసం మ్యూజిక్ ఇండస్ట్రీకి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని గ్యూక్ తెలిపారు. దీంతో 'BTS' ఫ్యాన్స్ అంతా దీనిని ఖండించడానికి ముందుకొచ్చారు. ఆ ఏడుగురి స్థానంలోకి ఎవరూ రాలేరని, వచ్చినా తాము యాక్సెప్ట్ చేయమని అంటున్నారు. ఒకవేళ మ్యూజిక్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనుకుంటే 'BTS' అనే పేరుతో కాకుండా మరికొన్ని పేర్లతో కొత్త బ్యాండ్స్‌ను ప్రారంభించవచ్చు కదా అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'BTS' కాకుండా మరెన్నో కొరియన్ మ్యూజిక్ బ్యాండ్స్ ఉన్నాయని, వాటిని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుందని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా 'న్యూ BTS' అనేది హాట్ టాపిక్‌గా మారింది.






అదే టార్గెట్..


కంటెంట్ విషయంలో కే కంటెంట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ మార్క్ అవ్వాలని సౌత్ కొరియా ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. 2035 లోపు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది. ఈ కంటెంట్ ద్వారా కనీసం 25 మిలియన్ డాలర్ల ఎక్స్‌పోర్ట్ టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటోంది. కానీ చాలావరకు ప్రేక్షకులు.. దీనిని యాక్సెప్ట్ చేసేలాగా కనిపించడం లేదు. ఎంత మంచి సింగర్స్‌తో ‘న్యూ BTS' ప్రారంభించినా కూడా ప్రేక్షకులు మాత్రం పాత సింగర్స్‌నే కావాలని కోరుకుంటున్నారు.



Also Read: ఆ విషయంలో రజనీకాంత్, ప్రభాస్, సల్మాన్‌లను వెనక్కి నెట్టిన షారుఖ్ - బాద్‌షా పేరుపై మరో రికార్డ్