'బిగ్ బాస్ 5' విజేత, యువ కథానాయకుడు వీజే సన్నీ (VJ Sunny) నటిస్తున్న కొత్త సినిమా 'సౌండ్ పార్టీ' (Sound Party Movie Telugu). ఇందులో హ్రితిక శ్రీనివాస్ కథానాయిక. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయ శంకర్ చిత్ర సమర్పకులు. ఇటీవల చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి.


'సౌండ్ పార్టీ' పోస్టర్ విడుదల చేసిన కవిత
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 'సౌండ్ పార్టీ' సినిమా పోస్టర్ విడుదల చేశారు. అనంతరం సినిమా ఘన విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఇంకా కవిత మాట్లాడుతూ ''సౌండ్ పార్టీ' టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ద‌ర్శ‌క - నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా'' అని అన్నారు. 


కవితకు 'సౌండ్ పార్టీ' టీమ్ థాంక్స్!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా 'సౌండ్ పార్టీ' పోస్టర్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని హీరో వీజే సన్నీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టైటిల్ మంచి రెస్పాన్స్ అందుకుంది. షూటింగ్ పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది'' అని అన్నారు. కవితకు నిర్మాతలలో ఒకరైన ర‌వి పోలిశెట్టి థాంక్స్ చెప్పారు. ఇంకా మాట్లాడుతూ ''ఫుల్ మూన్ మీడియా సంస్థలో 'సౌండ్ పార్టీ' మొదటి సినిమా. క‌విత గారు పోస్టర్ లాంచ్ చేయ‌డం ఎంతో ఆనందంగా, ప్రోత్సాహ‌క‌రంగా ఉంది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం'' అని అన్నారు.


Also Read : ట్రెండింగులో ఉంది 'బ్రో' - రెండో వారంలోనూ బాక్సాఫీస్‌లో పవన్ జోరు


తాము ఏ ఉద్దేశ్యంతో అయితే టైటిల్ పెట్టామో... అది ప్రేక్షకులకు సరిగ్గా చెరువు అయ్యిందని చిత్ర స‌మ‌ర్ప‌కుడు జ‌య‌శంక‌ర్ సంతోషం వ్యక్తం చేశారు. 'సౌండ్ పార్టీ' థియేటర్లలో గట్టిగా సౌండ్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''టైటిల్ విన్న వారంతా చాలా బావుందని అంటున్నారు. మా నిర్మాత‌ల ఇచ్చిన మద్దతుతో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను భారీగా తీశాం. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సంబంధించిన విష‌యాలు వెల్ల‌డిస్తాం'' అని అన్నారు.


Also Read మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?



'సౌండ్ పార్టీ'లో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, '30 ఇయర్స్' పృథ్వీ, 'మిర్చి' ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, 'జెమిని' సురేష్, భువన్ సాలూరు, అంజలి, ఇంటూరి వాసు, 'చలాకి' చంటి, ప్రేమ్ సాగర్, ఆర్జే హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు నటించారు. 'సౌండ్ పార్టీ' సినిమాకు కూర్పు : జి. అవినాష్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, పాటలు : పూర్ణ చారి, ఛాయాగ్రహణం : శ్రీనివాస్ రెడ్డి, సంగీతం : మోహిత్ రెహమానిక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : భువన్ సాలూరు, నిర్మాతలు : రవి పోలిశెట్టి - మహేంద్ర గజేంద్ర - శ్రీ శ్యామ్ గజేంద్ర, సమర్పణ : జ‌య‌శంక‌ర్‌, రచన - ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial