బాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ త్వరలో తల్లి కానున్నారు. నాలుగేళ్ల క్రితం... మే 8, 2018లో ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఈ విషయాన్ని ఈ రోజు వెల్లడించారు.


భర్త ఆనంద్ ఆహూజాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సోనమ్ కపూర్, తాను గర్భవతి అనే విషయాన్ని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన‌ ఫొటోల్లో సోనమ్ కపూర్ బేబీ బంప్‌తో కనిపించారు.


"నాలుగు చేతులు...
నిన్ను ఉన్నతంగా పెంచడానికి!
రెండు హృదయాలు...
నీతో కలిసి అడుగడుగునా హృదయ స్పందన పంచుకోవడానికి!
ఒక కుటుంబం...
నీకు ప్రేమ పంచడానికి, మద్దుతు ఇవ్వడానికి!
నిన్ను ఈ భూమ్మీదకు స్వాగతించడం కోసం ఎదురు చూస్తున్నాం" అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో సోనమ్ డెలివరీ కావచ్చని సమాచారం. 'కమింగ్ థిస్ ఫాల్ (శిశిర రుతువు)' అని ఒక హ్యాష్ ట్యాగ్ జోడించారు.


Also Read: నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేసిన సమంత


సోనమ్ కపూర్, ఆనంద్ ఆహూజా దంపతులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. కరీనా కపూర్, దియా మీర్జా, జాన్వీ కపూర్, వాణీ కపూర్, రవీనా టాండన్, హన్సిక, నర్గిస్ ఫక్రి, జాక్వలిన్ ఫెర్నాండేజ్, అనన్యా పాండే, రానా భార్య మిహీక, సయామీ ఖేర్, సోనాక్షీ సిన్హా, మలైకా అరోరా తదితరులు కంగ్రాచులేషన్స్ చెప్పారు. సోనమ్ పెళ్లి తర్వాత నుంచి గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. చాలా సార్లు ఆమె ఖండించారు.


Also Read: థియేట‌ర్ల‌లో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఎదురులేదు. మ‌రి, ఓటీటీల్లో? - ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు ఇవే