Samantha Unfollows Chay: నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేసిన సమంత

Samantha Naga Chaitanya Akkineni Latest Update: అక్కినేని నాగచైతన్యను సమంత ఫాలో అవ్వడం మానేశారు! ఏ విషయంలో? ఏమిటి? అనే వివరాల్లోకి...

Continues below advertisement

Samantha unfollows Naga Chaitanya on Instagram: అక్కినేని నాగ చైతన్య, సమంత మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అయితే, ఇద్దరూ వేరు పడ్డారనే విషయం తెలుసు. ఎందుకో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ, ఇద్దరిలో ఎవరూ అసలు విషయం ఏమిటన్నది చెప్పలేదు. తనపై వచ్చిన విమర్శలకు మాత్రమే సమంత బదులు ఇచ్చారు. అదంతా గతం. గతం గతః అని పక్కన పెట్టి... వర్తమానానికి వస్తే, సోషల్ మీడియాలో చైతన్యను ఫాలో అవ్వడం మానేశారు సమంత.

Continues below advertisement

Akkineni Naga Chaitanya and Samantha unfollow each other on Twitter: ట్విట్టర్‌లో నాగచైతన్య, సమంత ఒకరిని మరొకరు ఫాలో అవ్వడం మానేశారు. ఇన్‌స్టాగ్రామ్‌కు వచ్చేసరికి... నాగచైతన్యను సమంత ఫాలో అవ్వడం లేదు. కానీ, ఆమెను ఆయన ఫాలో అవుతున్నారు. చైతన్యను ఫాలో అవ్వడం మానేసిన సమంత... అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అమల, అఖిల్, సుశాంత్, దగ్గుబాటి ఫ్యామిలీలో రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రిత తదితరులను ట్విట్టర్ / ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. చైతన్యను మాత్రమే అన్ ఫాలో చేశారు.

Also Read: థియేట‌ర్ల‌లో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఎదురులేదు. మ‌రి, ఓటీటీల్లో? - ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు ఇవే
నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత గత ఏడాది అక్టోబర్ 2న తామిద్దరం వేరు పడుతున్నట్టు నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆ పోస్టును కూడా సమంత డిలీట్ చేశారు. ఒకటి రెండు ఫొటోలు మినహా నాగచైతన్యతో దిగిన ఫొటోలను కూడా తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్‌లో జంటగా దిగిన ఫొటోలు కొన్ని ఉన్నాయి.

Also Read: జూ. ఎన్టీఆర్‌ కారును ఆపిన పోలీసులు, లోపల ఆయన కుమారుడు కూడా, పోలీసులు ఏం చేశారంటే

Continues below advertisement